పరమతండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము - YouWorship
Paramathandri Karamuleththi Sthuthula Narpinthumu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: పరమతండ్రి కరములెత్తి - స్తుతుల నర్పింతుము (1) శిరములెత్తి స్వామి నీకై చూచుచుంటిమి (1) ఉజ్జీవ నాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగ (2) 1. పాప శాపములందు మేము - పడి చెడి యుండగా (2) దేవ మాదు దరికి జేరి - లేవ నెత్తితివి (2) ఎంత జాలి ఎంత ప్రేమ - స్తుతుల నర్పింతుము (2) 2. దినదినము నిను శోధించి - దుఃఖ పెట్టితిమి కేవలము శరీరులమని - కనికరించితివి క్షమించి మమ్ము కడిగితివి - స్తుతుల నర్పింతుము 3. నింద వేదన శ్రమలు బహు - నిట్టూర్పులయందు విసుగకుండ సేవచేయ - నొసగు నోర్పును నింపు నీ శుద్ధాత్మతోను - స్తుతుల నర్పింతుము 4. సూర్యచంద్ర తారలందు - వింత సూచనలు జరుగ జనులు ధైర్యము చెడి - కూలి చూచెదరు అయితే నీకై చూచు మేము - బలము నొందెదము 5. సమాజముగ కూర్చి నీదు - సన్నిధియందు ప్రార్థన సహవాసములలో - స్థిరులజేయుము తేరి చూస్తూ నీ రాకడకై - స్తుతుల నర్పింతుము 6. శత్రుటురులు త్రుంచివేసి - జీవమిచ్చితివి ఆహా! యేమర్పింతుము - నీ ఉపకారములకై చేతబట్టి రక్షణపాత్ర - స్తుతుల నర్పింతుము 7. గతబ్రతుకులో వాత్సల్యమున - గాచి యీ క్షితిన్ నడిపె నవ్యవత్సరముకై - కృపాక్షేమములతో సత్యుడ సిల్వశక్తి నొసగు - సాగముందుకు Pallavi: Paramathandri Karamuleththi - Sthuthula Narpinthumu (1) Shiramuleththi Svaami Neekai Choochuchuntimi (1) Ujjeeva Naathma Nosagu Niluva Sajeeva Saakshiga (2) 1. Paapa Shaapamulandu Memu - Padi Chedi Yundagaa (2) Deva Maadu Dariki Jeri - Leva Neththithivi (2) Entha Jaali Entha Prema - Sthuthula Narpinthumu (2) 2. Dinadinamu Ninu Shodhinchi - Duhkha Pettithimi Kevalamu Shareerulamani - Kanikarinchithivi Kshaminchi Mammu Kadigithivi - Sthuthula Narpinthumu 3. Ninda Vedana Shramalu Bahu - Nittoorpulayandu Visugakunda Sevacheya - Nosagu Norpunu Nimpu Nee Shuddhaathmathonu - Sthuthula Narpinthumu 4. Sooryachandra Thaaralandu - Vintha Soochanalu Jaruga Janulu Dhairyamu Chedi - Kooli Choochedaru Ayithe Neekai Choochu Memu - Balamu Nondedamu 5. Samaajamuga Koorchi Needu - Sannidhiyandu Praarthana Sahavaasamulalo - Sthirulajeyumu Theri Choosthoo Nee Raakadakai - Sthuthula Narpinthumu 6. Shathruturulu Thrunchivesi - Jeevamichchithivi Aahaa! Yemarpinthumu - Nee Upakaaramulakai Chethabatti Rakshanapaathra - Sthuthula Narpinthumu 7. Gathabrathukulo Vaathsalyamuna - Gaachi Yee Kshithin Nadipe Navyavathsaramukai - Krupakshemamulatho Sathyuda Silvashakthi Nosagu - Saagamunduku