పరదేశులమో ప్రియులారా - YouWorship
Paradeshulamo Priyulaaraa
Artist: గొల్లపల్లి నతానియేలు
Category: Hope
Song Lyrics
పరదేశులమో ప్రియులారా మన పురమిది గాదెపుడు (నిజముగ) (2) ||పరదేశుల|| చిత్ర వస్తువులు చెల్లెడి యొకవి చిత్రమైన సంత (లోకము) (2) ||పరదేశుల|| సంత గొల్లు క్షమ సడలిన చందం బంతయు సద్దణగన్ (నిజముగ) (2) ||పరదేశుల|| స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని బరలోకమే స్థిరము (నిజముగ) (2) ||పరదేశుల|| మేడలు మిద్దెలు మేలగు సరకులు పాడై కనబడవే (నిజముగ) (2) ||పరదేశుల|| ధర ధాన్యంబులు దరగక మానవు పని పాటలు పోయె (నిజముగ) (2) ||పరదేశుల|| ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన మన్నై పోవునుగా (దేహము) (2) ||పరదేశుల|| వచ్చితి మిచటికి వట్టి హస్తముల దెచ్చిన దేదియు లే (దు గదా) (2) ||పరదేశుల|| ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు అట్లు వెళ్ళవలయున్ (మింటికి) (2) ||పరదేశుల|| యేసు నందు విశ్వాసం బుంచిన వాసిగ నిను జేర్చున్ (బరమున) (2) ||పరదేశుల|| యేసే మార్గము యేసే సత్యము యేసే జీవముగా (నిజముగ) (2) ||పరదేశుల|| Paradeshulamo Priyulaaraa Mana Puramidi Gaadepudu (Nijamuga) (2) ||Paradeshula|| Chithra Vasthuvulu Chelledi Yokavi Chithramaina Santha (Lokamu) (2) ||Paradeshula|| Santha Gollu Kshama Sadalina Chandam Banthayu Saddanagan (Nijamuga) (2) ||Paradeshula|| Sthiramani Nammaku Dhara Yevvarikini Baralokame Sthiramu (Nijamuga) (2) ||Paradeshula|| Medalu Middelu Melagu Sarakulu Paadai Kanabadave (Nijamuga) (2) ||Paradeshula|| Dhara Dhaanyambulu Daragaka Maanavu Pani Paatalu Poye (Nijamuga) (2) ||Paradeshula|| Enni Naallu Mana Milalo Brathikina Mannai Povunugaa (Dehamu) (2) ||Paradeshula|| Vahchithi Michatiki Vatti Hasthamula Dechchina Dediyu Le (du Gadaa) (2) ||Paradeshula|| Etlu Vachchithimi Yee Lokamunaku Atlu Vellavalayun (Mintiki) (2) ||Paradeshula|| Yesu Nandu Vishwaasam Bunchina Vaasiga Ninu Jerchun (Baramuna) (2) ||Paradeshula|| Yese Maargamu Yese Sathyamu Yese Jeevamugaa (Nijamuga) (2) ||Paradeshula||