పదములు చాలని ప్రేమ - YouWorship
Padamulu Chaalani Prema
Artist: పి జ్యోతి రాజు
Category: Praise
Song Lyrics
పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది (2) కరములు చాపి నిను కౌగలించి పెంచిన కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ||పదములు|| నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా కన్నబిడ్డలే నిను వెలివేసినా (2) తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ ఆ వేదనంత తొలగించును ప్రేమ ||ప్రేమ|| మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా (2) మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమియించుట నేర్పించెడి ప్రేమా శాంతితో నిను నడిపించెడి ప్రేమ ||ప్రేమ|| Padamulu Chaalani Prema Idi Swaramulu Chaalani Varnanidi (2) Karamulu Chaapi Ninu Kougalinchi Penchina Kannavaarikante Idi Minnayaina Prema Vaarini Sahithamu Kanna Prema Prema Idi Yesu Prema Prema Idi Thandri Prema Prema Idi Praanamichchina Prema Kaluvari Prema ||Padamulu|| Nava Maasam Mosi Prayojakulanu Chesinaa Kannabiddale Ninu Velivesinaa (2) Thana Karamulu Chaapi Mudimi Vachchu Varaku Ninneththukoni Aadarinchu Prema Aa Vedanantha Tholaginchunu Prema ||Prema|| Melulenno Pondi Unnatha Sthithikedigina Snehithule Hrudayamunu Gaayaparachaga (2) Melulatho Nimpi Adbhuthamulu Chesi Kshamiyinchuta Nerpinchedi Premaa Shaanthitho Ninu Nadipinchedi Prema ||Prema||