న్యాయాధిపతి - YouWorship
Nyaayaadhipathi
Artist: క్రాంతి చేపూరి
Category: Gospel
Song Lyrics
న్యాయాధిపతియైన దేవుడు – నిన్ను పిలిచే వేళలోన ఏ గుంపులో ఉంటావో తెలుసుకో – మరలా వచ్చే వేళలోన (2) ఒక గుంపేమో పరలోకపు గుంపు రక్షింపబడిన వారికే అది సొంతం మరు గుంపేమో ఘోర నరకపు గుంపు నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం ||న్యాయాధిపతి|| నీవు కాదు నీ క్రియలు కాదు – ఆ పరముకు నిను చేర్చేది కాదు కాదు వేరెవరో కాదు – మరణమును తప్పించేది (2) కలువరిలో తన ప్రాణం పెట్టిన యేసయ్యే నీ ప్రాణ రక్షణ సిలువలో క్రయ ధనమే చెల్లించిన ఆ ప్రభువే నీ పాప విమోచన ||ఒక గుంపేమో|| ఇదియే సమయం ఇక లేదే తరుణం – నీ పాపము ఒప్పుకొనుటకు ఆ పరలోకం చేరే మార్గం – యేసేగా ప్రతి ఒక్కరకు (2) మేఘముపై రానైయున్నాడుగా త్వరలోనే నిను కొనిపోడానికి వెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమా నీ హృదిలో స్వీకరించడానికి ||ఒక గుంపేమో|| Nyaayaadhipathiyaina Devudu – Ninnu Piliche Velalona Ye Gumpulo Untaavo Thelusuko – Maralaa Vachche Velalona (2) Oka Gumpemo Paralokapu Gumpu Rakshimpabadina Vaarike Adi Sontham Maru Gumpemo Ghora Narakapu Gumpu Nija Devuni Erugani Vaariki Adi Antham ||Nyaayaadhipathi|| Neevu Kaadu Nee Kriyalu Kaadu – Aa Paramuku Ninu Cherchedi Kaadu Kaadu Verevaro Kaadu – Maranamunu Thappinchedi (2) Kaluvarilo Thana Praanam Pettina Yesayye Nee Praana Rakshana Siluvalo Kraya Dhaname Chellinchina Aa Prabhuve Nee Paapa Vimochana ||Oka Gumpemo|| Idiye Samayam Ika Lede Tharunam – Nee Paapamu Oppukonutaku Aa Paralokam Chere Maargam – Yesegaa Prathi Okkaraku (2) Meghamupai Raanaiyunnaadugaa Thvaralone Ninu Konipodaaniki Venudeeyaku O Naa Priya Nesthamaa Nee Hrudilo Sweekarinchadaaniki ||Oka Gumpemo||