నేనే భయపడ వలదని - YouWorship
Nene Bhayapada Valadani
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: నేనే భయపడ వలదని పలికెను - మన రక్షకుడు యేసుప్రభు (2) 1. తన సమాధానము నీ కిచ్చి - కృపల నెన్నో చూపెనుగా (2) తనివి తీర స్తుతి చెల్లించుము - తనదు ప్రేమదయకొరకు (2) 2. శాశ్వతంబగు జాలిజూపి - శాశ్వతరక్షణ నొసగి విశ్వాసముతో నిలచిన యెడల - శాశ్వత రాజ్యం బొసగు 3. నరుడుకాడు దేవుడతడు - నరుడు ఆయెను నీ కొరకు కరుణతో నిను రక్షించుటకు - సర్వమిచ్చెను శ్రీ యేసు 4. మరణించెను ప్రభు నీ కొరకే - తిరిగి లేచెను కాపాడన్ త్వరగ వచ్చును కనిపెట్టుము - నిరతమాయనతోనుండ 5. ఎంత పాపివైన నిలలో - చింత లేదిక నమ్మినచో వింత రక్షకుడేసు ప్రభువు - స్వంత ప్రాణమునర్పించె 6. నీదుయాత్రలో బలమిచ్చుటకు - తనదు దేహరక్తమును ముదముతో అర్పించిన ప్రభుకే - హల్లెలూయా పాడుము Pallavi: Nene Bhayapada Valadani Palikenu - Mana Rakshakudu YesuPrabhu (2) 1. Thana Samaadhaanamu Nee Kichchi - Krupala Nenno Choopenugaa (2) Thanivi Theera Sthuthi Chellinchumu - Thanadu Premadayakoraku (2) 2. Shaashvathambagu Jaalijoopi - Shaashvatharakshana Nosagi Vishvaasamutho Nilachina Yedala - Shaashvatha Raajyan Bosagu 3. Narudukaadu Devudathadu - Narudu Aayenu Nee Koraku Karunatho Ninu Rakshinchutaku - Sarvamichchenu Shree Yesu 4. Maraninchenu Prabhu Nee Korake - Thirigi Lechenu Kaapaadan Thvaraga Vachchunu Kanipettumu - Nirathamaayanathonunda 5. Entha Paapivaina Nilalo - Chintha Ledika Namminacho Vintha Rakshakudesu Prabhuvu - Svantha Praanamunarpinche 6. Needuyaathralo Balamichchutaku - Thanadu Deharakthamunu Mudamutho Arpinchina Prabhuke - Hallelooyaa Paadumu