నేనే భయపడ కూడదనెను - YouWorship
Nene Bhayapada Koodadanenu
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: నేనే భయపడ కూడదనెను ఆ ఆ ఆ - ఆ - ఆ - ఆ శిష్యులను ధైర్యపరచిన వాడతడే (2) 1. ఐదు రొట్టెలు రెండు చేపలతోనే - ఐదువేలను పోషించినవాడే (2) అద్దరికి వెళ్ళ నాజ్ఞాపించిన ప్రభువే - ప్రేమించిన వాడే (2) 2. గాలి యెదురైన ధైర్యము విడువకు - అన్నియు మేలుకై సమకూడి జరుగును అంతము వరకు తోడుగ నుండును - మొరలిడి కలవరపడకుడి 3. లోకములో మీకు శ్రమలే కలుగున్ - శ్రమలే సహజము నరులందరికిన్ శ్రమలో ధైర్యము కలిగించుటకై - వాగ్దానము లన్నియు నిచ్చెను 4. ఆయనే దేవుడు ఊరక యుండుడి - ఆయననే యెరుగుడి మీరు ఉన్నతుడాయనే అన్యజనులలో - మహోన్నతుడు భూజనములలో 5. కలవర పడకుండని నడువుచు తనబిడ్డల నాదరించినవాడే పరిశుద్ధాత్ముని అందర కొసగి - కృపజూపిన మహాప్రభుండే 6. యుద్ధము చేయును యెహోవా - స్తుతించుట మన విధి యగును యుద్ధాయుధము ఆత్మీయమైనది - ఆయనకే స్తుతి హల్లెలూయా Pallavi: Nene Bhayapada Koodadanenu Aa Aa Aa - Aa - Aa - Aa Shishyulanu Dhairyaparachina Vaadathade (2) 1. Aidu Rottelu Rendu Chepalathone - Aiduvelanu Poshinchinavaade (2) Addariki Vella Naagnaapinchina Prabhuve - Preminchina Vaade (2) 2. Gaali Yeduraina Dhairyamu Viduvaku - Anniyu Melukai Samakoodi Jarugunu Anthamu Varaku Thoduga Nundunu - Moralidi Kalavarapadakudi 3. Lokamulo Meeku Shramale Kalugun - Shramale Sahajamu Narulandarikin Shramalo Dhairyamu Kaliginchutakai - Vaagdaanamu Lanniyu Nichchenu 4. Aayane Devudu Ooraka Yundudi - Aayanane Yerugudi Meeru Unnathudaayane Anyajanulalo - Mahonnathudu Bhoojanamulalo 5. Kalavara Padakundani Naduvuchu Thanabiddala Naadarinchinavaade Parishuddhathmuni Andara Kosagi - Krupajoopina MahaaPrabhunde 6. Yuddhamu Cheyunu Yehovaa - Sthuthinchuta Mana Vidhi Yagunu Yuddhaayudhamu Aathmayamainadi - Aayanake Sthuthi Hallelooyaa