నేనే ఉన్నవాడననిన - YouWorship
Nene Unnavaadananina
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
"(సువర్ణ) దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని" ప్రకటన Revelation 1:13 పల్లవి : నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు 1. అల్ఫాయు ఓమేగ వర్తమాన - భూత భవిష్యత్తులో నున్నవాడా నా సర్వము నిర్వహించువాడా - సర్వాధికారి నిన్నే స్తుతించి అర్పింతు నీకే నా ఆరాధన || నేనే || 2. ఏడు సువర్ణ దీపస్తంభముల - మధ్య సంచరించుచున్నవాడా శుద్దీకరించితివి నన్ను - మేలిమిగ మార్చి సంఘమున చేర్చితివి నిన్నే ఆరాధింతు || నేనే || 3. తెల్లని ఉన్నిని పోలియున్న - వెంట్రుకలు కలిగి యున్నవాడా ఆలోచనకర్త నీవే నాకు - జ్ఞానమైతివి అసమానుండ అర్పింతు నీకే నా ఆరాధన || నేనే || 4. సూర్యుని వంటి ముఖము కలిగి - అగ్నిజ్వాలల నేత్రముల్ కలిగి దృష్టించితివి నా హృదయమున్ - దహించితివి దుష్టత్వము ప్రేమగల ప్రభూ నిన్నారాధింతు || నేనే || 5. అపరంజిని పోలిన పాదములు - కలవాడా తీర్పు తీర్చితివి పాపము లోకములనిల - దుష్ట సాతానున్ సిలువలో గెలిచి విజయ మిచ్చినందుల కారాధింతున్ || నేనే || 6. నీ నోటినుండి బయలువెడలె - రెండంచులు గల వాడి ఖడ్గము అదియే పాత ఆదామును చంపె - నశింప చేసె నా శత్రుబలమున్ అర్పింతు నీకే నా ఆరాధన || నేనే || 7. ఏడు నక్షత్రములు పట్టుకొనిన - మొదటివాడా కడపటివాడా సర్వ సంపూర్ణత నాకిచ్చితివి - అపాయములలో ఆదుకొనుచున్న ఆమేన్ అనువాడా హల్లెలూయ || నేనే || "(Suvarna) Deepa Sthambhamula Madhyanu Manushya Kumaaruni Polina Yokanini Choochithini" Prakatana Revelation 1:13 Pallavi : Nene Unnavaadananina Advitheeya Prabhu Aaraadhinthu 1. Alphaayu Omega Varthamaana - Bhootha Bhavishyaththulo Nunnavaadaa Naa Sarvamu Nirvahinchuvaadaa - Sarvaadhikaari Ninne Sthuthinchi Arpinthu Neeke Naa Aaraadhana || Nene || 2. Edu Suvarna Deepasthambhamula - Madhya Sancharinchuchunnavaadaa Shuddeekarinchithivi Nannu - Melimiga Maarchi Sangghamuna Cherchithivi Ninne Aaraadhinthu || Nene || 3. Thellani Unnini Poliyunna - Ventrukalu Kaligi Yunnavaadaa Aalochanakartha Neeve Naaku - Gnaanamaithivi Asamaanunda Arpinthu Neeke Naa Aaraadhana || Nene || 4. Sooryuni Vanti Mukhamu Kaligi - Agnijvaalala Nethramul Kaligi Drushtinchithivi Naa Hrudayamun - Dahinchithivi Dushtathvamu Premagala Prabhoo Ninnaaraadhinthu || Nene || 5. Aparanjini Polina Paadamulu - Kalavaadaa Theerpu Theerchithivi Paapamu Lokamulanila - Dushta Saathaanun Siluvalo Gelichi Vijaya Michchinandula Kaaraadhinthun || Nene || 6. Nee Notinundi Bayaluvedale - Rendanchulu Gala Vaadi Khadgamu Adiye Paatha Aadaamunu Champe - Nashimpa Chese Naa Shathrubalamun Arpinthu Neeke Naa Aaraadhana || Nene || 7. Edu Nakshathramulu Pattukonina - Modativaadaa Kadapativaadaa Sarva Sampoornatha Naakichchithivi - Apaayamulalo Aadukonuchunna Aamen Anuvaadaa Hallelooya || Nene ||