నేను ఘోరపాపిని చేరి వేడుచుంటిని క్షమించుము - YouWorship
Nenu Ghorapaapini Cheri Veduchuntini Kshaminchumu
Artist: సీయోను గీతాలు
Category: Repentance
Song Lyrics
పల్లవి: నేను ఘోరపాపిని (2) - చేరి వేడుచుంటిని క్షమించుము (2) 1. ఆదాము హవ్వలందున ఏదేనులో నే పొందిన (2) ఆది దోషము అంటియుండెనయ్య - దాని నిర్మూలించు మేసయ్యా (2) 2. నా తల్లి గర్భమందున అవతరించుట తోడనే పాపము తోడనే పుట్టితి నేసయ్యా - దాని పరిహరింపుము 3. నా యపరాధము చేతను నే జేసిన పాపమందున సత్యములేక నేజచ్చిన వాడను - ననుజీవింపచేయు మేసయ్యా 4. పాపములు దాచుకొంటిని శాపమును గూర్చుకొంటిని ఆపద గుర్తించ లేక నే గడిపితిని - దాపు జేరితి ప్రాపునీయుము 5. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేకను పచ్చిపుండ్లు గాయములతో నేసయ్యా - వచ్చి నీ ప్రాపున జేరితి 6. లోకానంద యంద మందున వీకతో వీక్షింపనేగితి దావీదువలె బెత్షెబా బారిలో నుంటి - దేవా విమోచించు మేసయ్యా 7. ఎన్నెనోమార్లు నీ సన్నిధిన్ నేను విడిచి ఏతెంచితి యోనావలె మీనాగర్భములో నుంటి - నన్ను నీదరిజేర్చు మేసయ్యా Pallavi: Nenu Ghorapaapini (2) - Cheri Veduchuntini Kshaminchumu (2) 1. Aadaamu Havvalanduna Edenulo Ne Pondina (2) Aadi Doshamu Antiyundenayya - Daani Nirmoolinchu Mesayyaa (2) 2. Naa Thalli Garbhamanduna Avatharinchuta Thodane Paapamu Thodane Puttithi Nesayyaa - Daani Pariharimpumu 3. Naa Yaparaadhamu Chethanu Ne Jesina Paapamanduna Sathyamuleka Nejachchina Vaadanu - Nanujeevimpacheyu Mesayyaa 4. Paapamulu Daachukontini Shaapamunu Goorchukontini Aapada Gurthincha Leka Ne Gadipithini - Daapu Jerithi Praapuneeyumu 5. Arikaalu Modalukoni Thala Varaku Svasthatha Lekanu Pachchipundlu Gaayamulatho Nesayyaa - Vachchi Nee Praapuna Jerithi 6. Lokaananda Yanda Manduna Veekatho Veekshimpanegithi Daaveeduvale Bethshebaa Baarilo Nunti - Devaa Vimochinchu Mesayyaa 7. Ennenomaarlu Nee Sannidhin Nenu Vidichi Ethenchithi Yonaavale Meenaagarbhamulo Nunti - Nannu Needarijerchu Mesayyaa