నేనును నా యింటివారును - YouWorship
Nenunu Naa Yintivaarunu
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
నేనును నా యింటివారును - నీతి సూర్యుని గొలుతుము = దీనమనసును గలిగి దేవుని - దివ్యసేవను జేతుము || 1. _అనుదినంబును - ప్రభుని దలచుచు - అలయకను ప్రార్థింతుము = అనవరత మా ప్రభుని చిత్తము - ననుకరింతుము పనులలో || 2. వేదవాక్య పఠనమందు - విసుగు - జెందక నుందుము = ఆదరంబున దైవ చిత్తము - ననుసరించుచు నడుతుము || 8. _ఆశతోడను ప్రభుని దినమును - నాచరింతుము మరువక = విసుకు జెందక నాలయమునకు - పిన్న పెద్దల దెత్తుము || 4. సంఘ కార్యక్రమములందు - సహకరింతుము ప్రతీతో = భంగ పరచెడి పనులన్నిటి - కృంగదీసెదమనిశము || 5. _ ప్రేమతోడను పొరుగువారిని - ప్రియులుగను భావింతుము = క్షమయు స్నేహము నేర్చి ప్రభుకడ - శాంతితో జీవింతుము || 6. _శక్తిగొలది శరీరబలమును - (శ్రమను క్రీస్తుకు నిత్తుము = భక్తితో హృదయమును పూర్తిగ - ప్రభునికే యర్చింతుము || 7. చిన్నవారలు దైవరాజ్యపు - వారసులంచును = అన్నివేళల వారి వృద్ధికి - మిన్నగ దోడ్చడెదము || 8. పెద్దవారలు దైవజనులని - పేర్మితో భావింతుము = శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును - జూపుచు || 9. _జీవితంబున ప్రభుని ప్రేమా - శ్శీసులను ప్రసరింతుము = దివ్యజ్యోతుల రీతి వెలుగుచు - దివ్యసన్నిధి నుందుము || -9. కిన్సింగర్ Nenunu Naa Yintivaarunu - Neethi Sooryuni Goluthumu = Deenamanasunu Galigi Devuni - Divyasevanu Jethumu || 1. _Anudinambunu - Prabhuni Dalachuchu - Alayakanu Praarthinthumu = Anavaratha Maa Prabhuni Chiththamu - Nanukarinthumu Panulalo || 2. Vedavaakya Pathanamandu - Visugu - Jendaka Nundumu = Aadarambuna Daiva Chiththamu - Nanusarinchuchu Naduthumu || 8. _Aashathodanu Prabhuni Dinamunu - Naacharinthumu Maruvaka = Visuku Jendaka Naalayamunaku - Pinna Peddala Deththumu || 4. Sanggha Kaaryakramamulandu - Sahakarinthumu Pratheetho = Bhangga Parachedi Panulanniti - Krunggadeesedamanishamu || 5. _ Premathodanu Poruguvaarini - Priyuluganu Bhaavinthumu = Kshamayu Snehamu Nerchi Prabhukada - Shaanthitho Jeevinthumu || 6. _Shakthigoladi Shareerabalamunu - (Shramanu Kreesthuku Niththumu = Bhakthitho Hrudayamunu Poorthiga - Prabhunike Yarchinthumu || 7. Chinnavaaralu Daivaraajyapu - Vaarasulanchunu = Annivelala Vaari Vruddhiki - Minnaga Dodchadedamu || 8. Peddavaaralu Daivajanulani - Permitho Bhaavinthumu = Shuddhudagu Prabhu Kreesthu Manasunu - Joopuchu || 9. _Jeevithambuna Prabhuni Premaa - Shsheesulanu Prasarinthumu = Divyajyothula Reethi Veluguchu - Divyasannidhi Nundumu || -9. Kinsinggar