నేడు నే నారక్షకుని నామదిలో - YouWorship
Nedu Ne Naarakshakuni Naamadilo
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నేడు నే నారక్షకుని నామదిలో చేర్చుకొన్నాను (2) సమాధాన సంతోషము అనుభవించితి నేను 2నేడు నే నారక్షకుని నామదిలో చేర్చుకొన్నాను (1) 1. ప్రభువాక్యము నా పాపముచూపె (2)- హృదయము విరిచె ఆయన ఆత్మ (2) గ్రుచ్చబడి నేను ఒప్పుకొంటిని (2)- కోరితి రక్తము మదిలో (2) 2. ప్రభు నాపాపము చూపించగానే - ఒప్పుకొంటిని కప్పుకొనక విశ్వాసముతో కన్నీటితో - ఒప్పుకొనగ క్షమియించె 3. పడమటికి తూర్పెంత దూరమో - నా పాపమునంత దూరపర్చితివి సముద్ర అగాధములలోన - నా పాపము పడవేసె 4. మిక్కిలి శ్రమలో నెమ్మదికలిగె - నాశన గోతిలో నుండిలేపి నీ వీపువెనుక నా పాపములు - పారవేసితివి వీవు 5. తుడిచితిననె ప్రభు నా పాపములు - జ్ఞాపకముంచుకొననని చెప్పె మంచు విడిచిపోయినరీతి - నా పాపము తొలగించె Pallavi: Nedu Ne Naarakshakuni Naamadilo Cherchukonnaanu (2) Samaadhaana Santhoshamu Anubhavinchithi Nenu 2Nedu Ne Naarakshakuni Naamadilo Cherchukonnaanu (1) 1. Prabhuvaakyamu Naa Paapamuchoope (2)- Hrudayamu Viriche Aayana Aathma (2) Gruchchabadi Nenu Oppukontini (2)- Korithi Rakthamu Madilo (2) 2. Prabhu Naapaapamu Choopinchagaane - Oppukontini Kappukonaka Vishvaasamutho Kanneetitho - Oppukonaga Kshamiyinche 3. Padamatiki Thoorpentha Dooramo - Naa Paapamunantha Dooraparchithivi Samudra Agaadhamulalona - Naa Paapamu Padavese 4. Mikkili Shramalo Nemmadikalige - Naashana Gothilo Nundilepi Nee Veepuvenuka Naa Paapamulu - Paaravesithivi Veevu 5. Thudichithinane Prabhu Naa Paapamulu - Gnaapakamunchukonanani Cheppe Manchu Vidichipoyinareethi - Naa Paapamu Tholaginche