నృపా విమోచకా ప్రభూ - YouWorship
Nrupaa Vimochakaa Prabhoo
Artist: చార్లెస్ వెస్లీ
Category: Praise & Worship
Song Lyrics
1. నృపా! విమోచకా! ప్రభూ వేలాది నోళ్ల నీ కృపా జయప్రభావముల్ నుతింతు నెంతయున్. 2. కృపాధికార! దేవ! నీ సాయంబు జేయుమా భవత్రభావ కీర్తులన్ జాటంగ నెల్లెడన్. 3. భయంబు చింతల బాపును హర్షంబు పాపికి సౌఖ్యంబు జీవశాంతు నీ నామ మిచ్చును. 4. విముక్తి జేయు జ్ఞానమిది పాపంబు బాపును పాపాత్ము శుద్ధుజేయును శ్రీయేసు రక్తము. 5. జనాళి! పాపు లెల్లరు! శ్రీయేసున్ నమ్ముండి కృపావిముక్తులందుండి సంపూర్ణ భక్తితో. 6. అర్పించె యేసు ప్రాణమున్ నరాళింగావను యజ్ఞంపు దేవు గొఱ్ఱెపై నఘంబు వేయుండి. 7. సత్కీర్తి స్తోత్ర ప్రేమ నభాన భూమిని సర్వత్ర దేవుండొందుగా సర్వత్ర పాడుచే. 1. Nrupaa! Vimochakaa! Prabhoo Velaadi Nolla Nee Krupaa Jayaprabhaavamul Nuthimthu Nemthayun. 2. Krupaadhikaara! Deva! Nee Saayambu Jeyumaa Bhavathrabhaava Keerthulan Jaatamga Nelledan. 3. Bhayambu Chimthala Baapunu Harshambu Paapiki Saukhyambu Jeevashaamthu Nee Naama Michchunu. 4. Vimukthi Jeyu Gnaanamidi Paapambu Baapunu Paapaathmu Shuddhujeyunu Shreeyesu Rakthamu. 5. Janaali! Paapu Lellaru! Shreeyesun Nammumdi Krupaavimukthulamdumdi Sampoorna Bhakthitho. 6. Arpimche Yesu Praanamun Naraalimgaavanu Yagnampu Devu Gorrepai Naghambu Veyumdi. 7. Sathkeerthi Sthothra Prema Nabhaana Bhoomini Sarvathra Devumdomdugaa Sarvathra Paaduche.