నూతన హృదయము - YouWorship
Noothana Hrudayamu
Artist: జోయెల్ కొడాలి
Category: Repentance
Song Lyrics
నూతన హృదయము నూతన స్వభావము నూతన ప్రారంభం నాకు దయచేయుము చెదరిన బ్రతుకును పగిలిన గుండెను నలిగిన మనస్సును నూతన పరచుము యేసు నీవే నన్ను సృజియించిన వాడవు నా బలహీనతలన్ని యెరిగియున్నావు రాతి గుండెను నాలో తీసివేయుము అతి మెత్తని హృదయము దయచేయుము ||నూతన హృదయము|| జీవమును వదులుకుని వెలుపలకు నే పారిపోతిని పాపములో భోగమును ఆశించి నే మోసపోతిని నా దేహం నా హృదయం వ్యసనముతోనే నిండిపోయెను హీనముగా దిగజారి ఘోరముగా నే కృంగిపోతిని నిన్ను విడచి నే క్షణమైనా బ్రతుకలేక వెనుతిరిగి నీ చెంతకు వచ్చుచున్నాను శుద్ధజలమును నాపై వెదజల్లుము హిమము కంటెను తెల్లగా కడిగివేయుము ||నూతన హృదయము|| నా పాపం అపరాధం నానుండి దూరము చేయుదువు అని నా భయము అవమానం బిడియమును తొలగించి వేతువని నా గతము జ్ఞాపకము నీ మదిలో ఇక దాచుకోవు అని నిన్నెరిగి ధైర్యముగా నీ ముందు నే నిలబడియున్నాను నీ శరణు కోరువారిని త్రోసివేయవు కృపగల మహాదేవ నన్ను మన్నించుము సదా కృతజ్ఞత స్తుతులు నీకే అర్పింతును సర్వ మహిమ ప్రభావము నీకే చెల్లును ||నూతన హృదయము|| Noothana Hrudayamu Noothana Swabhaavamu Noothana Praarambham Naaku Dayacheyumu Chedarina Brathukunu Pagilina Gundenu Naligina Manassunu Noothana Parachumu Yesu Neeve Nannu Srujiyinchina Vaadavu Naa Balaheenathalanni Yerigiyunnaavu Raathi Gundenu Naalo Theesiveyumu Athi Metthani Hrudayamu Dayacheyumu ||Noothana Hrudayamu|| Jeevamunu Vadulukuni Velupalaku Ne Paaripothini Paapamulo Bhogamunu Aashinchi Ne Mosipothini Naa Deham Naa Hrudayam Vyasanamuthone Nindipoyenu Heenamugaa Digajaari Ghoramugaa Ne Krungipothini Ninnu Vidachi Ne Kshanamainaa Brathukaleka Venuthirigi Nee Chenthaku Vacchuchunnaanu Shuddha Jalamunu Naapai Vedajallumu Himamu Kantenu Thellagaa Kadigiveyumu ||Noothana Hrudayamu|| Naa Paapam Aparaadham Naanundi Dooramu Cheyuduvu Ani Naa Bhayamu Avamaanam Bidyamunu Tholaginchi Vethuvani Naa Gathamu Gnaapakamu Nee Madilo Ika Daachukovu Ani Ninnerigi Dhairyamugaa Nee Mundu Ne Nilabadiyunnaanu Nee Sharanu Koruvaarini Throsiveyavu Krupagala Mahaadeva Nannu Manninchumu Sadaa Kruthagnatha Sthuthulu Neeke Arpinthunu Sarva Mahima Prabhaavamu Neeke Chellunu ||Noothana Hrudayamu||