నూతన సంవత్సరం - YouWorship
Noothana Samvathsaram
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నూతన సంవత్సరం దయచేసిన దేవా నీకే స్తోత్రములు అద్వితీయ ప్రభువా (2) ఆశ్చర్యకరుడవు ఆది సంభూతుడవు (2) అద్భుతకరుడవు అల్ఫా ఓమెగవు (2) ||నూతన || పాపాంధకారమునకు బానిసనై యున్నప్పుడు శాపముతో నేను హీనుడనై యున్నప్పుడు చేతులు చాచి నన్ను లేవనెత్తిన దేవా ప్రేమతో పిలిచి నన్ను ఆదరించిన ప్రభువా నీ ప్రేమ పిలుపుకు నే ఘనుడనైతిని నీ స్పర్శ తాకిడికి ఆత్మ పూర్ణుడైతిని ||నూతన|| కడవరి దినాలలో కంట నీరు పెడుతుండగా కష్టాలతో నేను సతమతమౌతుండగా నీ వాక్య వెలుగులో నడిపించిన నా ప్రభువా ఏ దిక్కు లేని నాకు దారి చూపిన తండ్రి నీ జాలి హృదయమునకు దాసుడ నేనైతిని నీ వాక్య జ్ఞానమునకు పరిచారకుడనైతిని ||నూతన|| Noothana Samvathsaram Dayachesina Devaa Neeke Sthothramul Advitheeya Prabhuvaa (2) Aascharyakarudavu Aadi Sambhoothudavu (2) Adbhuthakarudavu Alphaa Omegavu (2) ||Noothana|| Paapaandhakaaramunaku Baanisanai Yunnappudu Shaapamtho Nenu Heenudanai Yunnappudu Chethulu Chaachi Nannu Levanetthina Devaa Prematho Pilichi Nannu Aadarinchina Prabhuvaa Nee Prema Pilupuku Ne Ghanudanaithini Nee Sparsha Thaakidiki Aathma Poornudaithini ||Noothana|| Kadavari Dinaalalo Kanta Neeru Peduthundagga Kashtaalatho Nenu Sathamathamauthundagaa Nee Vaakya Velugulo Nadipinchina Naa Prabhuvaa Ae Dikku Leni Naaku Daari Choopina Thandri Nee Jaali Hrudayamunaku Daasuda Nenaithini Nee Vaakya Gnaanamunaku Parichaarakudanaithini ||Noothana||