నూతన ఆకాశమును భూమి - YouWorship
Noothana Aakaashamunu Bhoomi
Artist: సీయోను గీతాలు
Category: Hope
Song Lyrics
పల్లవి: నూతన ఆకాశమును భూమి నేను జూచితి - అందుండె శాంతి ఆనందజ్యోతి మహిమ తేజముల్ (2) ముందున్న భూమి యాకాశము లదృశ్యమాయెను - సముద్ర మికను లేదు అందున్న వెల్లను (2) 1. పరలోక రాజ్య పట్టణమెంతో యద్భూతము - గొఱ్ఱెపిల్ల కాంతితోడ దాని కాంతి ఎంతయో (2) సురక్షితంబు చేయబడెను ప్రాకారంబుతో- గొఱ్ఱెపిల్లకు యుగములు స్తుతియరాధన (2) 2. పరిశుద్ధ యెరూషలెము పరలోకమునుండి - దేవుని యొద్దనుండి దిగుట నేను చూచితి భర్తకొరకు అలంకరింపబడియున్న - పెండ్లికుమార్తెవలెనె సిద్ధమై యుండెను 3. సింహాసనము నుండి యొక స్వరము వింటిని - దేవుని నివాసము మనుజులలో నున్నది ఆయన వారితోడనే ఎల్లప్పుడుండును - ఆయన వారి దేవుడు వారాయన ప్రజలు 4. దేవుడు వారి కండ్లనీళ్ళు తుడిచివేయును - దుఃఖంబు మరణములు లీక నెన్నఁడుండవు ఏడ్పు బాధ శాపము లిక నెన్నడుండవు - రాత్రి లేదిక గొఱ్ఱెపిల్ల దీపంబాయెగా 5. సింహాసనాసీనుండు తానే మరల చెప్పెను - ఇదిగో సమస్తమును నూతనమాయెను పాతసంగతులెల్లను గతించి పోయెను - గతించినవి రావు మరల జ్ఞాపకమునకు 6. పట్టణమునకు ఎత్తైన ప్రాకారమున్నది - చుట్టు పండ్రెండు గుమ్మములు దానికున్నవి కట్టబడెను ముత్యములతో పునాదులు - చుట్టబడెను సూర్యకాంత సువర్ణములతో 7. పట్టణపు పునాదులు ప్రశస్తమైనవి - సూర్యకాంతము నీలము యమున పచ్చయు వైఢూర్యకెంపు స్వర్ణరత్న గోమేధికము - పుష్య పద్మరాగ స్వర్ణసునీయ సుగంధము 8. జయించువారు ధన్యులు యేలుదురెన్నడు - ధరించి తెల్ల వస్త్రములు సంతసింతురు ప్రభువు వారి - దేవుడై యుండు నిరంతము - వారసులై సర్వము స్వతంత్రించు కొందురు 9. ప్రభుని భక్తులారా మీరు సిద్ధపడుడి - అద్భుత రాజ్యమందు నుండ యాశపడుడి గొఱ్ఱెపిల్ల గ్రంథమున పేరున్న వారలు - ఘనంబుగ పరంబున ప్రవేశించెదరు Pallavi: Noothana Aakaashamunu Bhoomi Nenu Joochithi - Andunde Shaanthi Aanandajyothi Mahima Thejamul (2) Mundunna Bhoomi Yaakaashamu Ladrushyamaayenu - Samudra Mikanu Ledu Andunna Vellanu (2) 1. Paraloka Raajya Pattanamentho Yadbhoothamu - Gorrepilla Kaanthithoda Daani Kaanthi Enthayo (2) Surakshithambu Cheyabadenu Praakaarambutho- Gorrepillaku Yugamulu Sthuthiyaraadhana (2) 2. Parishuddha Yerooshalemu Paralokamunundi - Devuni Yoddanundi Diguta Nenu Choochithi Bharthakoraku Alangkarimpabadiyunna - Pendlikumaarthevalene Siddhamai Yundenu 3. Sinhaasanamu Nundi Yoka Svaramu Vintini - Devuni Nivaasamu Manujulalo Nunnadi Aayana Vaarithodane Ellappudundunu - Aayana Vaari Devudu Vaaraayana Prajalu 4. Devudu Vaari Kandlaneellu Thudichiveyunu - Duhkhambu Maranamulu Leeka Nennandundavu Edpu Baadha Shaapamu Lika Nennadundavu - Raathri Ledika Gorrepilla Deepambaayegaa 5. Sinhaasanaaseenundu Thaane Marala Cheppenu - Idigo Samasthamunu Noothanamaayenu Paathasanggathulellanu Gathinchi Poyenu - Gathinchinavi Raavu Marala Gnaapakamunaku 6. Pattanamunaku Eththaina Praakaaramunnadi - Chuttu Pandrendu Gummamulu Daanikunnavi Kattabadenu Muthyamulatho Punaadulu - Chuttabadenu Sooryakaantha Suvarnamulatho 7. Pattanapu Punaadulu Prashasthamainavi - Sooryakaanthamu Neelamu Yamuna Pachchayu Vaidhooryakempu Svarnarathna Gomedhikamu - Pushya Padmaraaga Svarnasuneeya Sugandhamu 8. Jayinchuvaaru Dhanyulu Yeludurennadu - Dharinchi Thella Vasthramulu Santhasinthuru Prabhuvu Vaari - Devudai Yundu Niranthamu - Vaarasulai Sarvamu Svathanthrinchu Konduru 9. Prabhuni Bhakthulaaraa Meeru Siddhapadudi - Adbhutha Raajyamandu Nunda Yaashapadudi Gorrepilla Granthamuna Perunna Vaaralu - Ghanambuga Parambuna Praveshinchedaru