నీ స్వరము - YouWorship
Nee Swaramu
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ (2) నీ వాక్యమును నేర్పించు దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము|| ఉదయమునే లేచి – నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు – నను సిద్ధపరచు రక్షించు ఆపదలనుండి – (2) ||నీ స్వరము|| నీ వాక్యము చదివి – నీ స్వరము వినుచు నేను సరి చేసికొందు నీ మార్గములో – నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ – (2) ||నీ స్వరము|| భయ భీతులలో – తుఫానులలో నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము – ఓ గొప్ప దేవా ధైర్య పరచుము నన్ను – (2) ||నీ స్వరము|| నాతో మాట్లాడు – స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే నీతో మనుష్యులతో – సరిచేసికొందు నీ దివ్య వాక్యము ద్వారా – (2) ||నీ స్వరము|| నేర్చుకున్నాను – నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా – నీ విశ్వాస్యతలో నీ యందు నిలచునట్లు – (2) ||నీ స్వరము|| నా హృదయములోని – చెడు తలంపులను చేధించు నీ వాక్యము నీ రూపమునకు – మార్చుము నన్ను నీదు మహిమ కొరకేగా – (2) ||నీ స్వరము|| Nee Swaramu Vinipinchu Prabhuvaa Nee Dhaasudaalakinchun (2) Nee Vaakyamunu Nerpinchu Daaniyandu Naduchunatlu Neetho ||Nee Swaramu|| Udayamune Lechi – Nee Swaramu Vinuta Naaku Entho Madhuramu Dinamanthati Koraku – Nanu Siddhaparachu Rakshinchu Aapadalanundi – (2) ||Nee Swaramu|| Nee Vaakyamu Chadivi – Nee Swaramu Vinuchu Nenu Sari Chesikondu Nee Maargamulo – Naduchunatlugaa Nerpinchumu Ellappudu – (2) ||Nee Swaramu|| Bhaya Bheethulalo – Thuphaanulalo Nee Swaramu Vinipinchumu Abhayamu Nimmu – O Goppa Devaa Dhairya Parachumu Nannu – (2) ||Nee Swaramu|| Naatho Maatlaadu – Spashtamugaa Prabhuvaa Nee Swaramu Naa Korake Neetho Manushyulatho – Sarichesikondu Nee Divya Vaakyamu Dvaaraa – (2) ||Nee Swaramu|| Nerchukunnaanu – Naa Shramala Dvaaraa Nee Vaakyamunu Entho Nannunchumu Prabhuvaa – Nee Vishwaasyathalo Nee Yandu Nilachunatlu – (2) ||Nee Swaramu|| Naa Hrudayamuloni – Chedu Thalampulanu Chedhinchu Nee Vaakyamu Nee Roopamunaku – Maarchumu Nannu Needu Mahima Korakegaa – (2) ||Nee Swaramu||