నీ ప్రియ ప్రభుని సేవకై - YouWorship
Nee Priya Prabhuni Sevakai
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవే పవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే (2) అంధకార జీవితమునకు – వెలుగు తెచ్చెను తానే (2) ఆ వెలుగు ద్వారానే – నూతన మార్గము కలిగె (2) సజీవ బలిగా నర్పించు – నీ జీవితమాయనకే (2) ||నీ ప్రియ|| తప్పిపోతివి గతమందు – తప్పు దారిని నడిచితివి (2) తన ప్రేమా హస్తమే – నిన్ను కాపాడి తెచ్చెను (2) యెంతైన స్మరియించు నీవు – వింతైన తన ప్రేమన్ (2) ||నీ ప్రియ|| ఓ ప్రియుడా తలచితివా – నీ జన్మమే పాపమని (2) ప్రభువే తన రక్తముతో – నీ పాపము క్షమియించె (2) నీ యుల్లము ఆయన కాలయమే – జ్ఞాపకముంచుకొనుము (2) ||నీ ప్రియ|| యెవరతని సేవించెదరో – ఫలమొందెదరంతమందు (2) ఇతరులకు లేనట్టి – ఆ ఘనతను నీ కిచ్చె (2) కృతజ్ఞుడవై కొనియాడు – ప్రభు పాద సన్నిధిని (2) ||నీ ప్రియ|| Nee Priya Prabhuni Sevakai – Arpinchuko Neeve Pavithra Prajalaina Meeru – Sevinchudaayanane (2) Andhakaara Jeevithamunaku – Velugu Thechchenu Thaane (2) Aa Velugu Dvaaraane – Noothana Maargamu Kalige (2) Sajeeva Baligaa Narpinchu – Nee Jeevithamaayanake (2) ||Nee Priya|| Thappipothivi Gathamandu – Thappu Daarini Nadichithivi (2) Thana Premaa Hasthame – Ninnu Kaapaadi Thechchenu (2) Yenthaina Smariyinchu Neevu – Vinthaina Thana Preman (2) ||Nee Priya|| O Priyudaa Thalachithivaa – Nee Janmame Paapamani (2) Prabhuve Thana Rakthamutho – Nee Paapamu Kshamiyinche (2) Nee Yullamu Aayana Kaalayame – Gnaapakamunchukonumu (2) ||Nee Priya|| Yevarathani Sevinchedaro – Phalamondedaranthamandu (2) Itharulaku Lenatti – Aa Ghanathanu Nee Kichche (2) Kruthagnudavai Koniyaadu – Prabhu Paada Sannidhini (2) ||Nee Priya||