నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా - YouWorship
Nee Paada Sannidhiki Krupamaya Yesayyaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నీ పాద సన్నిధికి - కృపామయ యేసయ్యా (1) నీ ప్రేమ కనుగొనుచు - దేవా నే వచ్చితిని (2) 1. విశ్రాంతి నిచ్చెడు దేవా - శ్రమలెల్ల తీర్చుమయ్యా (2) సిలువయే నా ఆశ్రయము - హాయిగా నచటుండెదను (2) 2. ప్రార్థించుమంటివి ప్రభువా - సంకట సమయములో దయచూపి నను కరుణించి - ప్రేమతో ఆదరించుమయ్యా 3. నరమాత్రుడవు నీవు కావు - మొఱ నాలకించుము మనస్సార ప్రార్థించుచు - యేసు నీదరి చేరెదను 4. నన్ను చేయి విడువకు నాథా - నిందలెన్నో పొందినను నీకై సహించెదనంత - నీ బలము నా కిమ్ము 5. ఆశతో నీ ముఖమును నేను - ఆసక్తితో చూడ సిగ్గుపడనుగా నేను - నీ ప్రకాశము నాపై నుండ 6. శత్రువు నోడించుటకు - నీ శక్తిని చూపు నన్నాదరించి నీవు - ఆవరించి కాపాడుము 7. జీవించి ఎదుగునట్లు - జయ జీవితంబిమ్ము ఫలించి వర్థిల్లుతకై - ప్రభువా నీ కృప నిమ్ము 8. సీయోను మూలరాయి - అయ్యున్న ఓ ప్రభువా కలతను చెందక నేను - నీకై కనిపెట్టెదను Pallavi: Nee Paada Sannidhiki - Krupamaya Yesayyaa (1) Nee Prema Kanugonuchu - Devaa Ne Vachchithini (2) 1. Vishraanthi Nichchedu Devaa - Shramalella Theerchumayyaa (2) Siluvaye Naa Aashrayamu - Haayigaa Nachatundedanu (2) 2. Praarthinchumantivi Prabhuvaa - Sangkata Samayamulo Dayachoopi Nanu Karuninchi - Prematho Aadarinchumayyaa 3. Naramaathrudavu Neevu Kaavu - Mora Naalakinchumu Manassaara Praarthinchuchu - Yesu Needari Cheredanu 4. Nannu Cheyi Viduvaku Naathaa - Nindalenno Pondinanu Neekai Sahinchedanantha - Nee Balamu Naa Kimmu 5. Aashatho Nee Mukhamunu Nenu - Aasakthitho Chooda Siggupadanugaa Nenu - Nee Prakaashamu Naapai Nunda 6. Shathruvu Nodinchutaku - Nee Shakthini Choopu Nannaadarinchi Neevu - Aavarinchi Kaapaadumu 7. Jeevinchi Edugunatlu - Jaya Jeevithambimmu Phalinchi Varthilluthakai - Prabhuvaa Nee Krupa Nimmu 8. Seeyonu Moolaraayi - Ayyunna O Prabhuvaa Kalathanu Chendaka Nenu - Neekai Kanipettedanu