నీ నామమే ఎద కొలిచెదను - YouWorship
Nee Naamame Eda
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీ నామమే ఎద కొలిచెదను నీ వాక్యమునే సదా తలచెదను (2) సైన్యములకధిపతియగు దేవా ఆది దేవుడవయిన యెహోవా (2) ||నీ నామమే|| దోష రహితుడ – సృష్టి కారుడ నేరమెంచని నిర్ణయకుడా సిలువ దరుడ – మరణ విజయుడ లోక రక్షక యేసు నాథుడా (2) ||సైన్యము|| నిన్ను మరచిన – మిగులు శూన్యము నీతో అణకువ పెంచు జ్ఞానము నాదు లోకము – బహు కలవరము నీదు వాక్యము తెలుపు మార్గము (2) ||సైన్యము|| క్షణము వీడని – నీడ నీవని నమ్మి నిరతము నిన్ను వేడెద నీదు పాత్రగ – యాత్ర సాగెద నీదు ఘనతను ఎలిగి చాటెద (2) ||సైన్యము|| Nee Naamame Eda Kolichedanu Nee Vaakyamune Sadaa Thalachedanu (2) Sainyamulakadhipathiyagu Devaa Aadi Devudavaina Yehovaa (2) ||Nee Naamame|| Dosha Rahithuda – Srushtikaaruda Neramenchani Nirnayakudaa Siluvadaruda Marana Vijayuda Loka Rakshaka Yesu Naathudaa (2) ||Sainyamu|| Ninnu Marachina Migulu Shoonyamu Neetho Anakuva Penchu Gnaanamu Naadu Lokamu Bahu Kalavaramu Needu Vaakyamu Thelupu Maargamu (2) ||Sainyamu|| Kshanamu Veedani Needa Neevani Nammi Nirathamu Ninnu Vededa Needu Paathragaa Yaathra Saageda Needu Ghanathanu Eligi Chaateda (2) ||Sainyamu||