నీ దీర్ఘశాంతమే - YouWorship
Nee Deergha Shaanthame
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము (2) యేసయ్యా… కనిపించరే నీలాగా ప్రేమించే వారెవరు (2) ||నీ దీర్ఘ|| కడుపేద స్థితిలోనే కరువే నా బంధువాయెను వయసొచ్చిన తరుణములో వస్త్ర హీనతే కృంగదీసెను (2) (ఏ) ఆధారము కనిపించని నా బ్రతుకులో ఐశ్వర్యవంతుడ నన్నాదుకున్నావు (2) యేసయ్యా… కనిపించరే నీలాగా దీవించే వారెవరు (2) ||నీ దీర్ఘ|| ఈ లోక జ్ఞానులలో వెర్రివానిగా ఉంటిని ఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని (2) తృణీకరింపబడిన నా బ్రతుకును కరుణా సంపన్నుడా నన్నెన్నుకున్నావు (2) యేసయ్యా… కనిపించరే నీలాగా కృప చూపే వారెవరు (2) ||నీ దీర్ఘ|| నా ప్రాణము నాలో కృంగివున్న సమయములో జీవము గల నీకై నా ప్రాణము పరితపించెను (2) మధురమైన నీ సహవాసముతో నా జీవ నాథుడా నీ మమతను పంచావు (2) యేసయ్యా… కనిపించరే నీలాంటి జీవము గల దేవుడెవ్వరు(2) ||నీ దీర్ఘ|| Nee Deergha Shaanthame Naa Hrudayaaniki Dhairyamu Nee Karunaa Kataakshamule Naa Brathukuku Aadhaaramu (2) Yesayyaa.. Kanipinchare Neelaagaa Preminche Vaarevvaru (2) ||Nee Deergha|| Kadu Peda Sthithilone Karuve Naa Bandhuvaayenu Vayasochchina Tharunamulo Vasthra Heenathe Krungadeesenu (2) (Ae) Aadhaaramu Kanipinchani Naa Brathukulo Aishwaryavanthuda Nannaadhukunnaavu (2) Yesayyaa.. Kanipinchare Neelaagaa Deevinche Vaarevaru (2) ||Nee Deergha|| Ee Loka Gnaanuloalo Verrivaanigaa Untini Ennikaina Vaarilo Vyardhunigaa Migili Untini (2) Thruneekarimpabadina Naa Brathukunu Karunaa Sampannudaa Nannennukunnaavu (2) Yesayyaa.. Kanipinchare Neelaagaa Krupa Choope Vaarevvaru (2) ||Nee Deergha|| Naa Praanamu Naalo Krungivunna Samayamulo Jeevamu Gala Neekai Naa Praanamu Parithapinchenu (2) Madhuramaina Nee Sahavaasamutho Naa Jeeva Naathudaa Nee Mamathanu Panchaavu (2) Yesayyaa.. Kanipinchare Neelaanti Jeevamu Gala Devudevvaru (2) ||Nee Deergha||