నీ కృపాతిశయము - YouWorship
Nee Krupaathishayamu
Artist: అషేర్ ఆండ్రూ
Category: Praise
Song Lyrics
నీ కృపాతిశయమును అనునిత్యము (2) నే కీర్తించెద తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును (2) నీ కృప.. నీ కృప.. ఆకాశము కంటె హెచ్చైనది (2) మౌనిగా ఎటులుండెద - సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు - నీ చెంత చేరే వరకు (2) ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృప ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృప ఏ మంచితనము లేకున్ననూ (2) కొనసాగించినది నీ కృప నిలబెట్టుకున్నది నీ కృప ||నీ కృప|| పది తరములుగా వెంటాడిన మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా మార్చెనే వేయి తరముల్ అన్యురాలైన ఆ రూతును ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నను దీవించగా ఏ శాపము నాపై పనిచేయదు ||నీ కృప|| ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృప మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృప కృపతోనే రక్షణ ఇచ్చావు నా క్రియల వలన కానే కాదు జీవితమంతా రుణస్తుడను నీ యందే నిత్యము అతిశయము ||నీ కృప|| ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాదానమే బలము ధనము ఉన్న అంటే నీదు కృపాదానమే ఏ అర్హత నాలో లేకున్ననూ కృపా భిక్షయే నా యెడల జీవితమంతా కృతజ్ఞుడను జీవితమంతా పాడెదను ||నీ కృప|| ప్రియులే నన్ను విడనాడినా శోకమే నా లోకమా అనాథగానే మిగిలానే నా కథ ముగిసినదే నీ కుడి చేతిలో ఉంచగనే బెన్యామిను వంతుగా మారె ఐదంతలాయె నా భాగ్యము విధిరాతనే మార్చె నీ కృప ||నీ కృప|| Nee Krupaathishayamunu Anunithyamu (2) Ne Keerthincheda Tharatharamulaku Nee Vishwaasyathanu Ne Prachurinthunu (2) Nee Krupa.. Nee Krupa.. Aakaashamu Kante Hechchainadi (2) Mounigaa Etulundeda - Saakshigaa Prachurinchaka Naa Thudi Shwaasa Varaku - Nee Chentha Chere Varaku (2) Inkaa Brathiki Unnaamante Kevalamu Nee Krupa Inkaa Sevalo Unnaamante Kevalamu Nee Krupa Ye Manchithanamu Lekunnanu (2) Konasaaginchinadi Nee Krupa Nilabettukunnadi Nee Krupa ||Nee Krupa|| Padi Tharamulugaa Ventaadina Moyaabu Shaapamu Nee Krupanu Sharanu Vedagaa Maarchene Veyi Tharamul Anyuraalaina Aa Roothunu Dhanyuraalugaa Maarchinadi Nee Krupaye Nanu Deevinchagaa Ye Shaapamu Naapai Panicheyadu ||Nee Krupa|| Aarogyam Udyogam Unnaayante Kevalamu Nee Krupa Methuku Brathuku Unnaayante Kevalamu Nee Krupa Krupathone Rakshana Ichchaavu Naa Kriyala Valana Kaane Kaadu Jeevithamanthaa Runasthudanu Nee Yande Nithyamu Athishayamu ||Nee Krupa|| Illu Vaahanamunnaayante Needu Krupaadaaname Balamu Dhanamu Unna Ante Needu Krupaadaaname Ye Arhatha Naalo Lekunnanu Krupaa Bhikshaye Naa Yedala Jeevithamanthaa Kruthagnudanu Jeevithamanthaa Paadedanu ||Nee Krupa|| Priyule Nannu Vidanaadinaa Shokame Naa Lokamaa Anaathagaane Migilaane Naa Katha Mugisinade Nee Kudi Chethilo Unchagane Benyaaminu Vanthugaa Maare Aidanthalaaye Naa Bhaagyamu Vidhiraathane Maarche Nee Krupa ||Nee Krupa||