నీ కృపయే నా ఆధారము - YouWorship
Nee Krupaye Naa Aadhaaramu
Artist: అబిగైల్ రాజ్ కుమార్
Category: Praise
Song Lyrics
నీ కృపయే నా ఆధారము - అతిశయించుటకు కారణము (2) యేసయ్య గొప్పవాడా - నా ఆనందం నీవేనయ్యా (2) నీ ప్రేమ నన్ను చేర్చుకున్నది - నా ప్రియుడా నేను ఉన్నానని చేయి చాపి - నీ దరి చేర్చితివే (2) ఒంటరితనములో నాతో నిలిచావు నా కన్నీరు తుడిచావు (2) విడువలేదయ్యా నన్ను ఎన్నడను మరువలేనయ్యా నేను నీ ప్రేమను (2) నీ కృపతో నన్ను దర్శించితివే - అనుదినము నూతనముగా ఇచ్చావు నాకు నీ స్థానము - నీతో ఉండుటకై (2) చీకటిలో నాకు వెలుగయ్యావు మరణములో నాకు జీవమయ్యావు (2) ||విడువలేదయ్యా|| తల్లి గర్భమునందే ఎన్నిక చేసి - నీకై ప్రతిష్టించితివే నీ చిత్తము నాలో జరిగించుటకై - దయతో పిలచితివే (2) శోధనలో నన్ను బలపరిచావు నిందలలో నన్ను హెచ్చించావు (2) IIవిడువలేదయ్యా|| Nee Krupaye Naa Aadhaaramu - Athishayinchutaku Kaaranamu (2) Yesayya Goppavaadaa - Naa Aanandam Neevenayyaa (2) Nee Prema Nannu Cherchukunnadi - Naa Priyudaa Nenu Unnaanani Cheyi Chaapi - Nee Dari Cherchithive (2) Ontarithanamulo Naatho Nilichaavu Naa Kanneeru Thudichaavu (2) Viduvledayyaa Nannu Ennadu Maruvalenayyaa Nenu Nee Premanu (2) Nee Krupatho Nannu Darshinchithive - Anudinamu Noothanamugaa Ichchaavu Naaku Nee Sthaanamu - Neetho Undutakai (2) Cheekatilo Naaku Velugayyaavu Maranamulo Naaku Jeevamayyaavu (2) ||Viduvaledayyaa|| Thalli Garbhamunande Ennika Chesi - Neekai Prathishtinchithive Nee Chiththamu Naalo Jariginchutakai - Dayatho Pilachithive (2) Shodhanalo Nannu Balaparichaavu Nindalalo Nannu Hechchinchaavu (2) ||Viduvaledayyaa||