నీ కన్న నింక - YouWorship
Nee Kanna Ningka
Artist: రావూరి లక్షీనరనయ్య
Category: Worship
Song Lyrics
నీ కన్న నింక వేరే - వేల్చులు లేరయ్యా = నిజముగా నా యేసువా = నీ కరుణ యను నెనరుచేతను - నీదు సత్య సువార్త ద్వార - ప్రాకటంబుగ నన్ను బిలిచిన- లోక రక్షక నీకు యముక్కెద ॥నీ కన్న॥ 1. నిన్ను దెలియక మున్ను - నన్య దైవంబుల - ననుసరించిన పాపము = లన్ని పెనగొని నాదు హృదయపు - గన్ను € గ్రమ్మి ప్రకాశ మియ్యక - యున్న నీ విమలాత్మ వరమున - నన్ను వెలిగించిన దయానిధి ॥నీ కన్న॥ 2. వదలక నేం జేయు - తుద లేని పాపము - వదలించి నను ట్రోచితి = తుదిదినంబునం గలుగు బాధలు దొలయగ జేయుట నీవ యని నా హృదయమందున నా నిరీక్షణ = పదిలపరచిన భక్త పాలక ॥నీ కన్న॥ 3. నీ వాక్యార్థము నాలో - నివసింప జేసి నీ - సేవకునిగం ట్రోవవే = నీవె సత్యము నీవె జీవము - నీవె మార్గము నీవె ద్వారము - నీవు గాకిం కెవరు లేరు - కావవే నను యేసునాయక ॥నీ కన్న॥ Nee Kanna Ningka Vere - Velchulu Lerayyaa = Nijamugaa Naa Yesuvaa = Nee Karuna Yanu Nenaruchethanu - Needu Sathya Suvaartha Dvaara - Praakatambuga Nannu Bilichina- Loka Rakshaka Neeku Yamukkeda ॥Nee Kanna॥ 1. Ninnu Deliyaka Munnu - Nanya Daivambula - Nanusarinchina Paapamu = Lanni Penagoni Naadu Hrudayapu - Gannu € Grammi Prakaasha Miyyaka - Yunna Nee Vimalaathma Varamuna - Nannu Veliginchina Dayaanidhi ॥Nee Kanna॥ 2. Vadalaka Nen Jeyu - Thuda Leni Paapamu - Vadalinchi Nanu Trochithi = Thudidinambunan Galugu Baadhalu Dolayaga Jeyuta Neeva Yani Naa Hrudayamanduna Naa Nireekshana = Padilaparachina Bhaktha Paalaka ॥Nee Kanna॥ 3. Nee Vaakyaarthamu Naalo - Nivasimpa Jesi Nee - Sevakunigan Trovave = Neeve Sathyamu Neeve Jeevamu - Neeve Maargamu Neeve Dvaaramu - Neevu Gaakin Kevaru Leru - Kaavave Nanu Yesunaayaka ॥Nee Kanna॥