నీవే నా సంతోషగానము - YouWorship
Neeve Naa Santhosha Gaanamu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీవే నా సంతోషగానము రక్షణశృంగము మహాశైలము (2) బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా|| ఓ లార్డ్! యు బి ద సేవియర్ షో మి సం మెర్సీ బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్ సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ ఐ విల్ సరెండర్ యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2) నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా|| వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2) మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా|| నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతివై వెలసినావు హీనశరీరం మహిమ శరీరముగ నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2) హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2) ||నీవే నా|| Neeve Naa Santhosha Gaanamu Rakshana Shrungamu Mahaa Shailamu (2) Balashoorudaaa Yesayyaa Naa Thodai Unnatha Sthalamulapai Nadipinchuchunnaavu (2) ||Neeve Naa|| O Lord! You be the Savior Show me some mercy Bless me with Your grace Savior! Fill me with Your love I will surrender You are my king Glory to the Jesus Thyaagamu Erugani Snehamandu Kshemamu Karuvai Yundagaa Nija Snehithudaa Praanamu Petti Nee Prematho Nannaakarshinchinaavu (2) Nirantharam Niluchunu Naapai Nee Kanikaram Shodhanalainaa Baadhalainanu Edurinthu Nee Prematho (2) ||Neeve Naa|| Vedana Kaligina Deshamandu Vekuva Velugai Nilichinaavu Viduvaka Thodai Abhivruddhi Parachi Aiguputhulo Simhaasanamichchinaavu (2) Maaradu Ennadu Neevichchina Darshanam Anudinam Anukshanam Neetho Naa Jeevitham (2) ||Neeve Naa|| Nirjeevamaina Ee Loyayandu Jeevaadhipathivai Velasinaavu Heena Shareeram Mahima Shaareeramuga Nee Vaakkutho Mahaa Sainyamuga Maarchinaaavu (2) Hallelooyaa Hallelooyaa Neeve Raaraajuvu Hosannaa Hosannaa Neeve Maharaajuvu (2) ||Neeve Naa||