నీవేయని నమ్మిక - YouWorship
Neeveyani Nammika
Artist: ముంగమూరి దేవదాస్
Category: Praise
Song Lyrics
నీవేయని నమ్మిక యేసు నాకు.. నీవేయని నమ్మిక నీవే మార్గంబు – నీవే సత్యంబు నీవే జీవంబు – నీవే సర్వంబు ||నీవే|| పెడదారిని బోవగ నా మీదికి.. ఇడుమలెన్నియో రాగ అడవిలో బడి నేను – ఆడలుచు నుండగ తడవకుండ దొరుకు – ధన్యమౌ మార్గంబు ||నీవే|| కారు మేఘము పట్టగ నా మనస్సులో.. కటిక చీకటి పుట్టగ ఘోరాపదలు చేరి – దారియని భ్రమపడగ తేరి చూడగల్గు – తేజోమయ మార్గంబు ||నీవే|| లేనిపోని మార్గంబు లెన్నోయుండ.. జ్ఞానోపదేశంబు మానుగ జేయుచు – వానిని ఖండించి నేనే మార్గంబన్న – నిజమైన మార్గంబు ||నీవే|| నరలోకమునుండి పరలోకంబు.. వరకు నిచ్చెనగా నుండి నరులకు ముందుగా – నడుచుచు ముక్తికి సరిగా కొనిపోవు సు-స్థిరమైన మార్గంబు ||నీవే|| Neeveyani Nammika Yesu Naaku.. Neeveyani Nammika Neeve Maargambu – Neeve Sathyambu Neeve Jeevambu – Neeve Sarvambu ||Neeve|| Pedadhaarini Bovaga Naa Meediki.. Idumalenniyo Raaga Adavilo Badi Nenu – Aadaluchu Nundaga Thadavakunda Doruku – Dhanyamou Maargambu ||Neeve|| Kaaru Meghamu Pattaga Naa Manassulo.. Katika Cheekati Puttaga Ghoraapadhalu Cheri – Daariyani Bramapadaga Theri Choodagalgu – Thejomaya Maargambu ||Neeve|| Leniponi Maargambu Lennoyunda.. Gnaanopadheshambu Maanuga Jeyuchu – Vaanini Khandinchi Nene Maargambanna – Nijamaina Maargambu ||Neeve|| Naralokamunundi Paralokambu.. Varaku Nichchenagaa Nundi Narulaku Munduga – Naduchuchu Mukthiki Sarigaa Konipovu Su-sthiramaina Maargambu ||Neeve||