నీవు లేని చోటేది - YouWorship
Neevu Leni Chotedi
Artist: విక్టర్ రాంపోగు
Category: Comfort
Song Lyrics
నీవు లేని చోటేది యేసయ్యా నే దాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా (2) నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2) నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని|| కయీను కౄర పగకు బలియైన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2) చెవి యొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే|| సౌలు ఈటె దాటికి గురియైన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2) నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా (2) ||నీవుంటే|| Neevu Leni Chotedi Yesayyaa Ne Daagi Kshanamundalenayyaa Neevu Choodani Sthalamedi Yesayyaa Kanumarugai Nenundalenayyaa (2) Neevu Vinanu Manavedi Yesayyaa Neevu Theerchani Bhaada Edi Yesayyaa (2) Neevunte Naa Venta Adiye Chaalayyaa (4) ||Neevu Leni|| Kayeenu Kroora Pagaku Baliyaina Hebelu Rakthamu Pettina Keka Vinna Devudavu Annala Ummadi Kutraku Guriyaina Yosepu Marana Ghosha Gothi Nundi Vinna Devudavu (2) Chevi Yoggi Naa Moranu Yesayyaa Neevu Vinakunte Ne Brathukalenayyaa (2) ||Neevunte|| Soulu Eete Daatiki Guriyaina Daaveedu Praanamu Kaapaadi Rakshinchina Devudavu Saathaanu Pannina Keeduku Motthabadina Yobunu Gelipinchi Deevenalu Kuripinchina Devudavu (2) Nee Thodu Nee Needa Yesayyaa Naaku Lekunte Ne Jeevinchalenayyaa (2) ||Neevunte||