నీవు లేని క్షణమైనా - YouWorship
Neevu Leni Kshanamainaa
Artist: ఆర్ లాజరస్
Category: Praise
Song Lyrics
నీవు లేని క్షణమైనా ఊహించలేను నీ కృప లేనిదే నేను బ్రతుకలేను (2) నీవే నా కాపరి – నీవే నా ఊపిరి నీవే నా సర్వము యేసయ్య నీతోనే జీవితం – నేనే నీకంకితం గైకొనుమో నన్ను ఓ దేవా… ||నీవు లేని|| శ్రమలెన్నో వచ్చినా – శోధనలే బిగిసినా నను ధైర్యపరిచె నీ వాక్యం సంద్రాలే పొంగినా – అలలే ఎగసినా నను మునగనీయక లేవనెత్తిన (2) నీవే నా కండగా – నాతో నీవుండగా భయమన్నదే నాకు లేదూ సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా వందనము నీకే ఓ దేవా… ||నీవు లేని|| శత్రువులే లేచినా – అగ్ని ఆవరించినా అవి నన్ను కాల్చజాలవుగా దుష్టులే వచ్చినా – సింహాలై గర్జించినా నాకేమాత్రం హాని చేయవుగా (2) వెన్నుతట్టి బలపరచిన – చేయిపట్టి నడిపించిన వేదనలే తొలగించిన యేసయ్యా సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా వందనము నీకే ఓ దేవా… ||నీవు లేని|| Neevu Leni Kshanamainaa Oohinchalenu Nee Krupa Lenide Nenu Brathukalenu (2) Neeve Naa Kaapari Neeve Naa Oopiri Neeve Naa Sarvamu Yesayyaa Neethone Jeevitham Nene Neekankitham Gaikonumo Nannu O Devaa… ||Neevu Leni|| Shramalenno Vachchinaa – Shodhanale Bigisinaa Nanu Dhairyapariche Nee Vaakyam Sandraale Ponginaa – Alale Egasinaa Nanu Munaganeeyaka Levanetthina (2) Neeve Naakandagaa – Naatho Neevundagaa Bhayamannade Naaku Ledu Sarvaloka Naathudaa – Kaapaade Devudaa Vandanamu Neeke O Devaa… ||Neevu Leni|| Sathruvule Lechinaa – Agnilaa Dahinchinaa Avi Nannu Kaalchajaalavugaa Dushtule Vachchinaa – Simhaalai Garjinchinaa Naakemaathram Haani Cheyavugaa (2) Vennu Thatti Balaparachina – Cheyi Patti Nadipinchina Vedhanale Tholaginchina Yesayyaa Sarvaloka Naathudaa – Kaapaade Devudaa Vandanamu Neeke O Devaa… ||Neevu Leni||