నీవు తప్ప నాకు ఇలలో - YouWorship
Neevu Thappa Naaku Ilalo
Artist: ఫిలిప్ ప్రకాష్
Category: Praise
Song Lyrics
నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా నీ ప్రేమ కన్నా సాటి భువిపై ఏదీ లేదయ్యా నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా గుండె నిండ నిండున్నావు ఓ నా యేసయ్యా ||నీవు తప్ప|| కష్టాల చెరలో చిక్కుకున్న నన్ను నీ ప్రేమ వరమే కురిపించినావు ఈ లోకమంతా వెలివేస్తున్న నీ ప్రేమ నాపై చూపించినావు నీ అరచేతిలో నను దాచినావయ్యా నా చేయి విడువక నను నడిపినావయ్యా నా తోడై నా నీడై వెంటుంటే చాలయ్యా ||నువ్వంటూ|| కన్నీటి అలలో మునిగిన నన్ను నీ దివ్య కరమే అందించినావు ఆ సిలువలోనే నీ ప్రాణమును నను రక్షింప అర్పించినావు నీ కృప నీడలో నను కాచినావయ్యా ఒక క్షణము వీడక కాపాడినావయ్యా నా శ్వాసై నా ధ్యాసై నువ్వుంటే చాలయ్యా ||నువ్వంటూ|| Neevu Thappa Naaku Ilalo Evarunnaarayyaa Nee Prema Kanna Saati Bhuvipai Yedee Ledaayya Nuvvantu Lekunte Ne Brathukalenaayya Nenila Unnananante Nee Dayenayyaa Nee Prema Lekunte Ee Janma Ledayyaa Gundeninda Nindunnavoo O Naayesayya Kashtaala Cheralo Chikkukunna Nannu Nee Prema Varame Kuripinchinaavu Ee Lokamanthaa Velivesthunnaa Nee Prema Naapai Choopinchinaavu Nee Arachethilo Nanu Daachinaavayyaa Naa Cheyi Viduvaka Nanu Nadipinaavayyaa Naa Thodai Naa Needai Ventunte Chaalayyaa ||Nuvvantu|| Kanneeti Alalo Munigina Nannu Nee Divya Karame Andinchinaavu Aa Siluvalone Nee Praanamunu Nanu Rakshimpa Arpinchinaavu Nee Krupa Needalo Nanu Kaachinaavayyaa Oka Kshanamu Veedaka Kaapaadinaavayyaa Naa Shwaasai Naa Dhyaasai Nuvvunte Chaalayyaa ||Nuvvantu||