నీదు విశ్వాస్యత - YouWorship
Needu Vishwaasyatha
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించెను (2) నిను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మానుజావళికి (2) నిబంధనను స్థిరముగ జేసి (2) నిరతము నలరారెడు మా ప్రభువా (2) ||నీదు|| వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా (2) వింతల కృపాంబుధి యగు దేవా (2) యెంతయో నిను స్తుతియింతుము కోరి (2) ||నీదు|| నీ సత్య సంధత్వ మహిమ నిరతము నిలయం సంస్తుతులకు (2) మెరసెను నా మదిలోన దేవా (2) మరువగ లేమి మధుర ప్రేమ (2) ||నీదు|| ఎంతైనను నమ్మదగిన వింతైన నీ విశ్వాస్యత (2) వాత్సల్యత వెలసెను మాపై (2) క్రొత్తగా ప్రతి దినము యేసు ప్రభు (2) ||నీదు|| మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు (2) వొనరుగ కాపాడును పదిలముగా (2) దిన దినమును నిందారహితముగా (2) ||నీదు|| తండ్రి కుమార శుద్ధాత్మకును తర తరములకు మహిమ ఘనత (2) పరిపూర్ణముగా ప్రబలును గాక (2) పరి పరి విధముల ప్రభు సంఘములో (2) ||నీదు|| Needu Vishwaasyatha Maa Prabhu Yesu Antharikshamu Nadhigaminchenu (2) Ninu Preminchi Nee Aagnalanu Anusarinchu Manujaavaliki (2) Nibandhananu Sthiramuga Jesi (2) Nirathamu Nalaraaredu Maa Prabhuvaa (2) ||Needu|| Veyi Tharamula Varaku Sarigaa Vilasilleti Velaleni Maa (2) Vinthala Krupaambudhi Yagu Devaa (2) Yenthayo Ninu Sthuthiyinthumu Kori (2) ||Needu|| Nee Sathya Sandhathva Mahima Nirathamu Nilayam Samsthuthulaku (2) Merasenu Naa Madilona Devaa (2) Maruvaga Lemi Madhura Prema (2) ||Needu|| Enthainanu Nammadagina Vinthaina Nee Vishwaasyatha (2) Vaathsalyatha Velasenu Maapai (2) Kroththaga Prathi Dinamu Yesu Prabhu (2) ||Needu|| Mana Aathmanu Jeevamu Dehamunu Mana Prabhu Yesu Raakada Varaku (2) Vonaruga Kaapaadunu Padilamugaa (2) Dina Dinamunu Nindaarahithamugaa (2) ||Needu|| Thandri Kumaara Shudhdhaathmakunu Thara Tharamulaku Mahima Ghanatha (2) Paripoornamugaa Prabalunu Gaaka (2) Pari Pari Vidhamula Prabhu Sanghamulo (2) ||Needu||