నీతో సమమెవరు - YouWorship
Neetho Samamevaru
Artist: ఆకుమర్తి డేనియల్
Category: Praise
Song Lyrics
నీతో సమమెవరు – నీలా ప్రేమించేదవరు నీలా క్షమియించేదెవరు – యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన – వారెవరు (2) లోక బంగారము – ధన ధాన్యాదులు ఒక పోగేసినా – నీతో సరితూగునా జీవ నదులన్నియు – సర్వ సంద్రములు ఒకటై ఎగసినా – నిన్ను తాకగలవా లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు ||నీతో|| పలు వేదాలలో – మత గ్రంథాలలో పాపమే సోకని – పరిశుద్దుడేడి పాప పరిహారార్థం – సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి – దైవ నరుడెవ్వరు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు ||నీతో|| నేను వెదకకున్నా – నాకు దొరికితివి నేను ప్రేమించకున్నా – నన్ను ప్రేమించితివి పలు గాయాలు చేసి – తరచు రేపితిని నన్నెంతో సహించి – క్షమియించితివి నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి నీవేగా విమోచకుడవు ||నీతో|| Neetho Samamevaru – Neelaa Preminchedavru Neelaa Kshamiyinchedevaru – Yesayyaa Neelaa Paapikai Praanam Pettina – Vaarevaru (2) Loka Bangaaramu – Dhana Dhaanyaadulu Oka Pogesinaa – Neetho Sarithoogunaa Jeeva Nadulanniyu – Sarva Sandramulu Okatai Egasinaa – Ninnu Thaakagalavaa Loka Soukhyaalannee Oka Chota Kummarinchina Neevegaa Chaalina Devudavu ||Neetho|| Palu Vedaalalo – Matha Granthaalalo Paapame Sokani – Parishudhdhudedi Paapa Parihaaraartham – Siluva Maranamondi Thirigi Lechinatti – Daiva Narudevvaru Neelaa Parishudhdha Devudevarunnaarayyaa Neevegaa Manchi Devudavu ||Neetho|| Nenu Vedakakunnaa – Naaku Dorikithivi Nenu Preminchakunnaa – Nannu Preminchithivi Palu Gaayaalu Chesi – Tharachu Repithini Nannentho Sahinchi – Kshamiyinchithivi Neelaa Jaaligala Premagala Devudedi Neevegaa Vimochakudavu ||Neetho||