నీతి సూర్యుడు నీపై నుదయించును - YouWorship
Neethi Sooryudu Neepai Nudayinchunu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నీతి సూర్యుడు నీపై నుదయించును - అతని రెక్కలు నారోగ్యము నిచ్చును (2) 1. పాపపు టంధకారమందుంటిమి - శాప శిక్షపొంద తగియుంటిమి (2) దాపున జేరిన నీతి సూర్యుడు (2) - నీపై ప్రకాశించు నిత్యము (2) 2. కృపయు సత్యము యేసుద్వార కల్గెన్ - కృపనుబొందగ వేగమే రారమ్ము అపరిమిత కృపనుండి నీవు - కృపవెంబడి కృప బొందెదవు 3. వారాయన తట్టు తేరిచూడగా - వారి ముఖము బహు ప్రకాశించెను పరమ ప్రభును చూడు నీతి సూర్యుని - కిరణంబులు వెల్గునిచ్చును 4. మందిరమంత యెహోవా తేజస్సు - అందరు చూడ నిండి యుండెను సుందరమగు క్రీస్తు తేజస్సును - పొంది యారాధించి స్తుతించు 5. తన మహిమకు రాజ్యమునకును - మనలను పిలిచిన దేవునికి వినయముతోడ విధేయులమై - నడుచుకొందుము నిత్యము Pallavi: Neethi Sooryudu Neepai Nudayinchunu - Athani Rekkalu Naarogyamu Nichchunu (2) 1. Paapapu Tandhakaaramanduntimi - Shaapa Shikshaponda Thagiyuntimi (2) Daapuna Jerina Neethi Sooryudu (2) - Neepai Prakaashinchu Nithyamu (2) 2. Krupayu Sathyamu Yesudvaara Kalgen - Krupanubondaga Vegame Raarammu Aparimitha Krupanundi Neevu - Krupavembadi Krupa Bondedavu 3. Vaaraayana Thattu Therichoodagaa - Vaari Mukhamu Bahu Prakaashinchenu Parama Prabhunu Choodu Neethi Sooryuni - Kiranambulu Velgunichchunu 4. Mandiramantha Yehovaa Thejassu - Andaru Chooda Nindi Yundenu Sundaramagu Kreesthu Thejassunu - Pondi Yaaraadhinchi Sthuthinchu 5. Thana Mahimaku Raajyamunakunu - Manalanu Pilichina Devuniki Vinayamuthoda Vidheyulamai - Naduchukondumu Nithyamu