నీతి సూర్యుండు ఉదయించు - YouWorship
Neethi Sooryundu Udayinchu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నీతి సూర్యుండు ఉదయించు నిప్పుడు (2) అతని కిరణములు ఆరోగ్యమిచ్చును (2)- రెక్కలతోనే కప్పును మనలన్ (2) నీతి సూర్యుండు ఉదయించు నిప్పుడు (1) 1. కొలిమి కాలునట్లు కాల్చెడి దినము - తిలకించుము అది వచ్చుచున్నది (2) ఇల గర్విష్టులు దుష్టులెల్లరు - పాలుపొందెదరు అగ్నిగుండమున (2) 2. సైన్యములధిపతి సెలవిచ్చెను - ఖాయముచూడు నాశనదినము భయంకరమైనది తీర్పుదినము -చేయును నాశము రూపులేకుండ 3. దేవునికి మీరు భయపడినచో - పశ్చాతాపమొందు, పశ్చాతాపమొందు జీవము నొసగును సమృద్ధిగా - కరమునిచ్చి మిమ్ముకాపాడును 4. ప్రభు నియమించిన ఆ దినమురాగ - ప్రభు ప్రజలందరు తన సొత్తగుదురు ప్రభు కరుణించును పుత్రులుగా - అధికారమిచ్చును స్వాస్థ్యము నొసగి 5. క్రీస్తుని ప్రేమ అమూల్యమైనదియు - నిత్యము నిల్చెడి ఆత్మీయమైనది దుష్టులకొరకై ప్రాణమిడె - క్షమాపణ నొసగి విమోచించుతానే 6. ప్రభు ప్రజలారా శత్రుని తలను - విభుని సాయమున అణగద్రొక్కెదరు శత్రువులందరు దూళి అగుదురు - విజయానందము మీరు పొందెదరు 7. మరువకుడి ప్రభు మాటలెన్నడు - స్థిరముగనుండి సిద్ధపడుడి త్వరగా మహిమతో ప్రభు వచ్చున్ - పరమున మిమ్ము తనతోనుంచును Pallavi: Neethi Sooryundu Udayinchu Nippudu (2) Athani Kiranamulu Aarogyamichchunu (2)- Rekkalathone Kappunu Manalan (2) Neethi Sooryundu Udayinchu Nippudu (1) 1. Kolimi Kaalunatlu Kaalchedi Dinamu - Thilakinchumu Adi Vachchuchunnadi (2) Ila Garvishtulu Dushtulellaru - Paalupondedaru Agnigundamuna (2) 2. Sainyamuladhipathi Selavichchenu - Khaayamuchoodu Naashanadinamu Bhayangkaramainadi Theerpudinamu -Cheyunu Naashamu Roopulekunda 3. Devuniki Meeru Bhayapadinacho - Pashchaathaapamondu, Pashchaathaapamondu Jeevamu Nosagunu Samruddhigaa - Karamunichchi Mimmukaapaadunu 4. Prabhu Niyaminchina Aa Dinamuraaga - Prabhu Prajalandaru Thana Soththaguduru Prabhu Karuninchunu Puthrulugaa - Adhikaaramichchunu Svaasthyamu Nosagi 5. Kreesthuni Prema Amoolyamainadiyu - Nithyamu Nilchedi Aathmayamainadi Dushtulakorakai Praanamide - Kshamaapana Nosagi Vimochinchuthaane 6. Prabhu Prajalaaraa Shathruni Thalanu - Vibhuni Saayamuna Anagadrokkedaru Shathruvulandaru Dooli Aguduru - Vijayaanandamu Meeru Pondedaru 7. Maruvakudi Prabhu Maatalennadu - Sthiramuganundi Siddhapadudi Thvaragaa Mahimatho Prabhu Vachchun - Paramuna Mimmu Thanathonunchunu