నీతి న్యాయములు - YouWorship
Neethi Nyaayamulu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా నిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2) వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజ్య దండముతో ||నీతి|| ప్రతి వాగ్ధానము నా కొరకేనని ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు (2) నిత్యమైన కృపతో నను బలపరచి ఘనతను దీర్గాయువును దయచేయువాడవు (2) ||నీతి|| పరిమళ వాసనగ నేనుండుటకు పరిశుద్ధ తైలముతో – నన్నభిషేకించి యున్నావు నీవు (2) ప్రగతి పథములో నను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు (2) ||నీతి|| నిత్య సీయోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనను – నాతో స్థిరపరచుచున్నావు నీవు (2) మహిమ కలిగిన పాత్రగ ఉండుటకు ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు (2) ||నీతి|| Neethi Nyaayamulu Jariginchu Naa Yesayyaa Nithya Jeevardhamainavi Nee Shaasanamulu (2) Vruddhi Chesithivi Parishuddha Janamugaa Nee Priyamaina Swaasthyamunu Raddu Chesithivi Prathivaadi Thanthramulanu Nee Raajya Dandamutho ||Neethi|| Prathi vaagdhaanamu Naa Korakenani Prathi Sthalamandu – Naa Thodai Kaapaaduchunnaavu Neevu (2) Nithyamaina Krupatho Nanu Balaparachi Ghanathanu Deerghaayuvunu Dayacheyuvaadavu (2) ||Neethi|| Parimala Vaasanaga Nenundutaku Parishuddha Thailamutho – Nannabhishekinchi Yunnaavu Neevu (2) Pragathi Pathamulo Nanu Nadipinchi Prakhyaathini Manchi Perunu Kaliginchuvaadavu (2) ||Neethi|| Nithya Seeyonulo Neetho Niluchutaku Nithya Nibandhananu – Naatho Sthiraparchuchunnaavu Neevu (2) Mahima Kaligina Paathraga Undutaku Pragna Vivekamulatho Nanu Nimpuvaadavu (2) ||Neethi||