నీతిగల యెహోవా స్తుతి - YouWorship
Neethigala Yehovaa Sthuthi
Artist: పసుపులేటి దావీదు
Category: Praise
Song Lyrics
నీతిగల యెహోవా స్తుతి మీ – ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి – దాతయవు మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి ||నీతి|| చదల బుడమియు రవియు జలధియు – నదులు గిరులును జక్కగా సదమలంబగు దైవ నామము – సర్వదా నుతి జేయును ||నీతి|| సర్వశక్తుని కార్యముల కీ – సర్వ రాష్ట్రము లన్నియు గర్వములు విడి తలలు వంచుచు – నుర్విలో నుతిజేయను ||నీతి|| గీత తాండవ వాద్యములచే – బ్రీతి పరచెడు సేవతో పాతకంబులు పరిహరించెడు – దాతనే సేవించుడి ||నీతి|| పరమ దూతలు నరులు పుడమిని – మొరలుబెట్టుచు దేవుని పరము నందున్నట్టి యేసుని – పాదములు సేవింతురు ||నీతి|| ఇలను భక్తులు గూడుకొనియా – బలము గల్గిన దేవుని వెలయు స్తుతి వే నోళ్ళతోడను – విసుగు జెందక జేయుడి ||నీతి|| ఆత్మ నీవిక మేలుకొని శు – ధ్ధాత్మ యేసుని దండ్రిని త్రిత్వమగునా యేక దేవుని – హర్షమున సేవింపవే ||నీతి|| Neethigala Yehovaa Sthuthi Mee – Aathmatho Narpinchudi Mee Aathmatho Narpinchudi – Daathayou Mana Kreesthu Neethini Daalchukoni Sevinchudi ||Neethi|| Chadala Budamiyu Raviyu Jaladhiyu – Nadulu Girulunu Jakkagaa Sadamalambagu Daiva Naamamu – Sarvadaa Nuthi Jeyunu ||Neethi|| Sarvashakthuni Kaaryamula Kee – Sarva Raashtramu Lanniyu Garvamulu Vidi Thalalu Vanchuchu – Nurvilo Nuthijeyanu ||Neethi|| Geetha Thaandava Vaadyamulache – Breethi Parachedu Sevatho Paathakambulu Pariharinchedu – Daathane Sevinchudi ||Neethi|| Parama Doothalu Narulu Pudamini – Moralubettuchu Devuni Paramu Nandunnatti Yesuni – Paadamulu Sevinthuru ||Neethi|| Ilanu Bhakthulu Goodukoniyaa – Balamu Galgina Devuni Velayu Sthuthi Ve Nollathodanu – Visugu Jendaka Jeyudi ||Neethi|| Aathma Neevika Melukoni Shu – dhdhaathma Yesuni Dandrini Thrithvamagunaa Yeka Devuni – Harshamuna Sevimpave ||Neethi||