నిశ్చలమైనది యేసు రాజ్యము - YouWorship
Nishchalamainadi Yesu Raajyamu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: నిశ్చలమైనది యేసు రాజ్యము (2) ప్రకాశించే రాజ్యము - యుగయుగములు నిలుచును2 ప్రభుని రాజ్యము (1) - నిశ్చలమైనది యేసు రాజ్యము (2) 1. క్రీస్తు రాజ్య సింహాసనమెంతో గొప్పది - కనకంబున కన్న బహు ప్రకాశించును (2) దానిచుట్టు దేవుని మహిమ యుండును (2) దీక్షతోడ జయించెడువారే పొందెదరు (2) 2. నాశనము లేనిది యేసు రాజ్యము - నిత్యుడగు తండ్రి దాని స్థిరము జేసెను ప్రభుని రాజ్యము యెంతో అనంతమైనది పరిపాలించు తానే తరతరంబులు 3. తన రాజ్యమహిమకు మిమ్ము పిలిచెను - వినయముగా నీతి భక్తికలిగి నిలువుడి కడవరకు విశ్వాసము కలిగియుండిన క్రీస్తుయేసు మీకు నీతి మకుటమిచ్చును 4. యేసురక్తమందు యెవరు కడుగబడెదరో - వారే హృదయశుద్ధిని పొందెదరిలలో పరలోక రాజ్యములో ప్రవేశింతురు ప్రవిమలుని ముఖము జూచి సంతసింతురు 5. భూలోక రాజ్యములు అంతరించును - ప్రభుయేసు రాజ్యము నిలచు స్థిరముగా నీతి సమాధానములతో దేవుడేలును నేడే చేరవా నీవు ఆ రాజ్యములో? Pallavi: Nishchalamainadi Yesu Raajyamu (2) Prakaashinche Raajyamu - Yugayugamulu Niluchunu2 Prabhuni Raajyamu (1) - Nishchalamainadi Yesu Raajyamu (2) 1. Kreesthu Raajya Sinhaasanamentho Goppadi - Kanakambuna Kanna Bahu Prakaashinchunu (2) Daanichuttu Devuni Mahima Yundunu (2) Deekshathoda Jayincheduvaare Pondedaru (2) 2. Naashanamu Lenidi Yesu Raajyamu - Nithyudagu Thandri Daani Sthiramu Jesenu Prabhuni Raajyamu Yentho Ananthamainadi Paripaalinchu Thaane Tharatharambulu 3. Thana Raajyamahimaku Mimmu Pilichenu - Vinayamugaa Neethi Bhakthikaligi Niluvudi Kadavaraku Vishvaasamu Kaligiyundina KreesthuYesu Meeku Neethi Makutamichchunu 4. Yesurakthamandu Yevaru Kadugabadedaro - Vaare Hrudayashuddhini Pondedarilalo Paraloka Raajyamulo Praveshinthuru Pravimaluni Mukhamu Joochi Santhasinthuru 5. Bhooloka Raajyamulu Antharinchunu - PrabhuYesu Raajyamu Nilachu Sthiramugaa Neethi Samaadhaanamulatho Devudelunu Nede Cheravaa Neevu Aa Raajyamulo?