నిశ్చయముగ నిన్ను దీవించెదను - YouWorship
Nishchayamuga Ninnu Deevinchedanu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: నిశ్చయముగ నిన్ను దీవించెదను (2) నిశ్చయముగ నిన్ను వృద్ధి పొందింతున్ (2) నిశ్చయముగ నిన్ను వృద్ధి పొందింతున్ (2) 1. ప్రత్యక్షమై పలికెనుగ ప్రభువు - సర్వశక్తిగల యెహోవాను నేను (2) నా సన్నిధిన్ నిర్దోషిగా నడచిన (2) - నీతో నిబంధన నియమింతును (2) 2. నీ సంతానమును దీవించి - నిన్ను ఫలియింప జేసెదను నీలో నుండి జనములు వచ్చును - నీతో నిబంధన స్థిరపరతున్ 3. యుగయుగములు నీకు దేవుడను - కనాను దేశము నీకొసగెదను నిత్యస్వాస్థ్యమును నీ కొసగెదను - నీలో మహిమ నే పొందెదను 4. గొప్ప జనముగా జేసెదనిన్ను - నిశ్చయముగా ఆశీర్వదింతున్ నీనామమును గొప్ప జేసెదను - ఆశీర్వాదముగ జేసెదను 5. నిన్నాశీర్వదించువారిని - నేను ఆశీర్వదించెదను దూషించువారిని నే శపించెదను - నీ ద్వారా దీవింపబడెదరు Pallavi: Nishchayamuga Ninnu Deevinchedanu (2) Nishchayamuga Ninnu Vruddhi Pondinthun (2) Nishchayamuga Ninnu Vruddhi Pondinthun (2) 1. Prathyakshamai Palikenuga Prabhuvu - Sarvashakthigala Yehovaanu Nenu (2) Naa Sannidhin Nirdoshigaa Nadachina (2) - Neetho Nibandhana Niyaminthunu (2) 2. Nee Santhaanamunu Deevinchi - Ninnu Phaliyimpa Jesedanu Neelo Nundi Janamulu Vachchunu - Neetho Nibandhana Sthiraparathun 3. Yugayugamulu Neeku Devudanu - Kanaanu Deshamu Neekosagedanu Nithyasvaasthyamunu Nee Kosagedanu - Neelo Mahima Ne Pondedanu 4. Goppa Janamugaa Jesedaninnu - Nishchayamugaa Aasheervadinthun Neenaamamunu Goppa Jesedanu - Aasheervaadamuga Jesedanu 5. Ninnaasheervadinchuvaarini - Nenu Aasheervadinchedanu Dooshinchuvaarini Ne Shapinchedanu - Nee Dvaaraa Deevimpabadedaru