నిరాకారా, సురూపుడా, మనోహరా - YouWorship
Niraakaaraa, Suroopudaa, Manoharaa
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: నిరాకారా, సురూపుడా, మనోహరా (1) కరిగితివా నాకై వ్రేలాడుచు (2)- సిలువలో - నిరాకారా (1) 1. వారుల దెబ్బలబాధ నొంది - వాడి మేకులతో గ్రుచ్చబడి (2) తీరని దాహము సహించితివి (2) - సిలువలో (1) 2. మానవులు ఏడ్చి ప్రలాపింప - భూరాజు లెల్లరు మాడిపోగా శిష్యుల డెందములు పగుల - సిలువలో 3. అరచి ప్రాణము వీడిన సుతుడా - వైరి నే నీ పాదముల బడితిని కోరి రక్షణ నెరవేర్చితివి - సిలువలో 4. కోరి సిల్వభారమును మోసితివి - పాపభారమును ద్రుంచితివి ఘోర గాయములు పొందితివి - సిలువలో 5. నన్ను రక్షింపను ఎన్ని పాట్లన్ - పెన్నుగ నీవు సహించితివి నన్ను నీ చిత్తమున బిడ్డచేయ - సిలువలో 6. కౄరుడు ప్రక్కనీటె గ్రుచ్చగా - నీదు రక్తమును పారెనయ్యా! తీరుగా నే రక్షణ పొందను - సిలువలో 7. ఒక్కడగు నిత్య దేవునికే - ఒక్కడగు సుతుడేసునకే ఒక్కడగు సత్య ఆత్మ నీకే - హల్లెలూయా Pallavi: Niraakaaraa, Suroopudaa, Manoharaa (1) Karigithivaa Naakai Vrelaaduchu (2)- Siluvalo - Niraakaaraa (1) 1. Vaarula Debbalabaadha Nondi - Vaadi Mekulatho Gruchchabadi (2) Theerani Daahamu Sahinchithivi (2) - Siluvalo (1) 2. Maanavulu Edchi Pralaapimpa - Bhooraaju Lellaru Maadipogaa Shishyula Dendamulu Pagula - Siluvalo 3. Arachi Praanamu Veedina Suthudaa - Vairi Ne Nee Paadamula Badithini Kori Rakshana Neraverchithivi - Siluvalo 4. Kori Silvabhaaramunu Mosithivi - Paapabhaaramunu Drunchithivi Ghora Gaayamulu Pondithivi - Siluvalo 5. Nannu Rakshimpanu Enni Paatlan - Pennuga Neevu Sahinchithivi Nannu Nee Chiththamuna Biddacheya - Siluvalo 6. Kroorudu Prakkaneete Gruchchagaa - Needu Rakthamunu Paarenayyaa! Theerugaa Ne Rakshana Pondanu - Siluvalo 7. Okkadagu Nithya Devunike - Okkadagu Suthudesunake Okkadagu Sathya Aathma Neeke - Hallelooyaa