నిన్ను విడువను నేను - YouWorship
Ninnu Viduvanu Nenu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నిన్ను విడువను నేను - అందరు నిన్ను విడచినను - నిన్ను ఎన్నడు ఎడబాయను నేను - నిన్ను (1) 1. యేసుని పొలములో పనిచేసెడి (2) - దాసులందరికిదే వాగ్దానము (2) ఆత్మల పంట కోయునపుడు (2) - మీతో నుందును నేను (1) 2. దుష్టుడు నిరుత్సాహ పరచును - కష్టపడినను ఫలితము లేదని యిష్టముగా పనిచేయుము నీవు - శ్రేష్ఠుడొసగును జయము 3. కాయమునందు విత్తిన నీవు - క్షయమను పంటను కోతువు ఆత్మీయముగా విత్తిన కోతువు - నిత్య జీవపు పంట 4. మానవులను లెక్కించకుము - ప్రాణుల ప్రభుకై సంపాదింప నిను కృంగఁజేయు నిష్మాయేలెప్పుడు - కనుమిస్సాకులో జయము 5. మనకు మాదిరి క్రీస్తునుంచెను - తన స్వరూపమునకు మారునట్లు మనము ప్రభుని పోలునట్లు - ఆత్మ చేయున్ మనలన్ 6. మనదు స్వార్థము పోవునట్లు - ఆయనతో శ్రమపడుటయే మార్గము క్రీస్తు స్వరూపమేర్పడు మనలో - అగ్నిపరీక్ష యందు 7. జలములలో దాటునపుడు - జ్వాలలందు నడచునపుడు బలముగా మీకుతోడై యుండి - నిలిపెదను నా దృష్టి Pallavi: Ninnu Viduvanu Nenu - Andaru Ninnu Vidachinanu - Ninnu Ennadu Edabaayanu Nenu - Ninnu (1) 1. Yesuni Polamulo Panichesedi (2) - Daasulandarikide Vaagdaanamu (2) Aathmala Panta Koyunapudu (2) - Meetho Nundunu Nenu (1) 2. Dushtudu Niruthsaaha Parachunu - Kashtapadinanu Phalithamu Ledani Yishtamugaa Panicheyumu Neevu - Shreshthudosagunu Jayamu 3. Kaayamunandu Viththina Neevu - Kshayamanu Pantanu Kothuvu Aathmayamugaa Viththina Kothuvu - Nithya Jeevapu Panta 4. Maanavulanu Lekkinchakumu - Praanula Prabhukai Sampaadimpa Ninu Krungganjeyu Nishmaayeleppudu - Kanumissaakulo Jayamu 5. Manaku Maadiri Kreesthununchenu - Thana Svaroopamunaku Maarunatlu Manamu Prabhuni Polunatlu - Aathma Cheyun Manalan 6. Manadu Svaarthamu Povunatlu - Aayanatho Shramapadutaye Maargamu Kreesthu Svaroopamerpadu Manalo - Agnipareeksha Yandu 7. Jalamulalo Daatunapudu - Jvaalalandu Nadachunapudu Balamugaa Meekuthodai Yundi - Nilipedanu Naa Drushti