నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై - YouWorship
Nithyudesune Sthuthinchu Thana Sathyamu Korakai
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నిత్యుడేసునే స్తుతించు - తన సత్యము కొరకై - నిత్యుడేసునే స్తుతించు (1) అను పల్లవి: మధ్యవర్తియాయే చెదరిన - పరిశుద్ధులకు తానే యిలలో (2) 1. మేఘ మండల మంటుచున్నది - నాకు దాహంబది తీర్చుచున్నది (2) వేగమే మనుజులను మార్చివేయును - మార్చివేయునదియే (2) 2. విడుదలను ఇచ్చునదియే - విడిపించు ఘోరపాపము నుండి కడు శ్రమలనది స్వీకరించును - స్వీకరించునదియె 3. పృధివి నెల్లయు మారిపోయినన్ - సత్యమెన్నడు మారనే మారదు నిత్యమైన యేసు సత్యమాయెనిలలో - సత్యమాయెనిలలో 4. ఖడ్గంబుబోలి కోయునదియె - పడగొట్టును దుష్టులనదియే వడివడిగా తనపని నెరవేర్చునదియే - నెరవేర్చునదియే 5. ఉదకంబు బోలి కడుగునదియే - అద్దముబోలి చూపునదియే అది బంగారు విలువ గలది - విలువ గలదియే 6. దీపమై చీకటిని పోగొట్టును - కోపమున్ బారద్రోలును నదియే ఆపదలనెల్ల తొలగించునదియే - తొలగించునదియే 7. సుతైను బోలి పగులగొట్టును - మెత్తగా చేసి ఒప్పించునదియే క్రొత్త తేనెన్ బోలి రుచించునదియే - హల్లెలూయా ఆమెన్ Pallavi: Nithyudesune Sthuthinchu - Thana Sathyamu Korakai - Nithyudesune Sthuthinchu (1) Anu Pallavi: Madhyavarthiyaaye Chedarina - Parishuddhalaku Thaane Yilalo (2) 1. Megha Mandala Mantuchunnadi - Naaku Daahambadi Theerchuchunnadi (2) Vegame Manujulanu Maarchiveyunu - Maarchiveyunadiye (2) 2. Vidudalanu Ichchunadiye - Vidipinchu Ghorapaapamu Nundi Kadu Shramalanadi Sveekarinchunu - Sveekarinchunadiye 3. Prudhivi Nellayu Maaripoyinan - Sathyamennadu Maarane Maaradu Nithyamaina Yesu Sathyamaayenilalo - Sathyamaayenilalo 4. Khadgambuboli Koyunadiye - Padagottunu Dushtulanadiye Vadivadigaa Thanapani Neraverchunadiye - Neraverchunadiye 5. Udakambu Boli Kadugunadiye - Addamuboli Choopunadiye Adi Banggaaru Viluva Galadi - Viluva Galadiye 6. Deepamai Cheekatini Pogottunu - Kopamun Baaradrolunu Nadiye Aapadalanella Tholaginchunadiye - Tholaginchunadiye 7. Suthainu Boli Pagulagottunu - Meththagaa Chesi Oppinchunadiye Kroththa Thenen Boli Ruchinchunadiye - Hallelooyaa Aamen