నిజ స్నేహితుడా - YouWorship
Nija Snehithudaa
Artist: జాషువా కట్ట
Category: Good Friday
Song Lyrics
నా చెలిమి కోరి – నీ కలిమి వీడి నా చెంత చేరావు శ్రీమంతుడా నా రక్షణ కొరకై – ఆ శిక్షను పొంది బలియాగమైన నిజ స్నేహితుడా ||నా చెలిమి|| ద్రోహినై దూరమైతిని – పాపినై పరుగులెడితిని గమ్యమే ఎరుగనైతిని – మరణమే శరణమాయెను ఎంతో ప్రేమించితివి – నా స్థానమందు నిలిచితివి కృపతో నన్ రక్షించితివి – నా దోషశిక్ష భరించితివి ||నా చెలిమి|| నిందలు అవమానములు – హేళనలు చీత్కారములు కఠిన దెబ్బలు ముళ్లపోటులు – సిలువ భారం కాయమంతా గాయం హృదినే బాధించినా – భరియించావు వేదన మౌనముగా తనువే తల్లడిల్లినా – తృప్తినొందావు నను తలచుకొని ||నా చెలిమి|| ఏ రీతి నిన్ను – కీర్తించగలను నా నీతి నీవే ఓ యేసుదేవా నీ సాక్షిగ నిలిచి – నీ ప్రేమను చాటి ఘనపరతును నిన్నే ప్రియ స్నేహితుడా Naa Chelimi Kori – Nee Kalimi Veedi Naa Chentha Cheraavu Sreemanthudaa Naa Rakshana Korakai – Aa Shikshanu Pondi Baliyaagamaina Nija Snehithudaa ||Naa Chelimi|| Drohinai Dooramaithini – Paapinai Paruguledithini Gamyame Eruganaithini – Maraname Sharanamaayenu Entho Preminchithivi – Naa Sthaanamandu Nilichithivi Krupatho Nan Rakshinchithivi – Naa Dosha Shiksha Bharinchithivi ||Naa Chelimi|| Nindalu Avamaanamulu – Helanalu Cheethkaaramulu Katina Debbalu Mulla Potulu – Siluva Bhaaram Kaayamanthaa Gaayam Hrudine Baadhinchinaa – Bhariyinchaavu Vedana Mounamugaa Thanuve Thalladillinaa – Thrupthinondaavu Nanu Thalachukoni ||Naa Chelimi|| Ae Reethi Ninnu – Keerthinchagalanu Naa Neethi Neeve O Yesudevaa Nee Saakshiga Nilichi – Nee Premanu Chaati Ghanaparathunu Ninne Priya Snehithudaa