నా హృదయాన కొలువైన - YouWorship
Naa Hrudayaana Koluvaina
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నా హృదయాన కొలువైన యేసయ్యా నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో – ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా (2) ||నా హృదయాన|| అగ్ని ఏడంతలై – మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను (2) అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడెనే (2) నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా (2) ||నా హృదయాన|| అంతా వ్యర్థమని – వ్యర్థులైరెందరో నా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనే (2) నీయందు పడిన ప్రయాసము – శాశ్వత కృపగా నాయందు నిలిచెనే (2) నీపై విశ్వాసమే – నన్ను బలపరచెనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును (2) ||నా హృదయాన|| విత్తినది ఒకరు – నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవ్వరైననూ – వృద్ధి చేసింది నీవే కదా (2) సంఘక్షేమాభివృద్ధికే – పరిచర్య ధర్మము నియమించినావే (2) నీ ఉపదేశమే – నన్ను స్థిరపరచెనే నా సర్వము నీకే అర్పింతును (2) ||నా హృదయాన|| Naa Hrudayaana Koluvaina Yesayyaa Naa Anuvanuvu Ninne – Prasthuthinchene Keerthaneeyudaa Naa Hrudayaarpanatho – Pranamilledane Nee Sannidhilo Poojaarhudaa (2) ||Naa Hrudayaana|| Agni Edanthalai Manduchundinanu Agni Jwaalalu Thaakaledule – Nee Priyula Dehaalanu (2) Agni Balamu Challaarene – Shathru Samoohamu Allaadene (2) Nenu Nee Swaasthyame – Neevu Naa Sonthame Naa Sthothrabalulanni Neekenayyaa (2) ||Naa Hrudayaana|| Anthaa Vyardhamani Vyardhulairendaro Naa Guri Neepai Nilpinanduke – Naa Parugu Saardhakamaayene (2) Nee Yandu Padina Prayaasamu – Shaashwatha Krupagaa Naa Yandu Nilichene (2) Neepai Vishwaasamu – Nannu Balaparachene Naa Swarametthi Ninne Keerthinthunu (2) ||Naa Hrudayaana|| Vitthinadi Okaru – Neeru Posindi Verokaru Eruvu Vesindi Evvarainanu – Vruddhi Chesindi Neeve Kadaa (2) Sangha Kshemaabhivruddhike – Paricharya Dharmamu Niyaminchinaave (2) Nee Upadeshame – Nannu Sthiraparachene Naa Sarvamu Neeke Arpinthunu (2) ||Naa Hrudayaana||