నా హృదయములో - YouWorship
Naa Hrudayamulo Nee Maatale
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు (2) కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించిన నీ కార్యములను వివరింప తరమా నీ ఘన కార్యములు వర్ణింప తరమా (2) ||నా హృదయములో|| మనస్సులో నెమ్మదిని కలిగించుటకు మంచు వలె కృపను కురిపించితివి (2) విచారములు కొట్టి వేసి విజయానందముతో నింపినావు నీరు పారేటి తోటగా చేసి సత్తువ గల భూమిగా మార్చినావు ||నీ కార్యములను|| విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించి (2) అగ్ని శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు ఆర్పజాలని జ్వాలగా చేసి దీప స్తంభముగా నను నిలిపినావు ||నీ కార్యములను|| పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు (2) పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు ||నీ కార్యములను|| Naa Hrudayamulo Nee Maatale Naa Kanulaku Kaanthi Rekhalu (2) Kaaru Cheekatilo Kaluvari Kiranamai Katina Hrudayamunu Kariginchina Nee Kaaryamulanu Vivarimpa Tharamaa Nee Ghana Kaaryamulu Varnimpa Tharamaa (2) ||Naa Hrudayamulo|| Manassulo Nemmadini Kaliginchutaku Manchu Vale Krupanu Kurpinchithivi (2) Vichaaramulu Kotti Vesi Vijayaanandamutho Nimpinaavu Neeru Paareti Thotagaa Chesi Satthuva Gala Bhoomigaa Maarchinaavu ||Nee Kaaryamulanu|| Virajimme Udaya Kaanthilo Nireekshana Dhairyamunu Kaliginchi (2) Agni Shodhanalu Jayinchutaku Mahimaathmatho Nimpinaavu Aarpajaalani Jwaalagaa Chesi Deepa Sthambhamugaa Nanu Nilipinaavu ||Nee Kaaryamulanu|| Pavithruraalaina Kanyakagaa Parishuddha Jeevithamu Cheyutaku (2) Paavana Rakthamutho Kadigi Paramaanandamutho Nimpinaavu Siddhapaduchunna Vadhuvugaa Chesi Sugunaala Sannidhilo Nanu Nilipinaavu ||Nee Kaaryamulanu||