నా హృదయమంత - YouWorship
Naa Hrudayamantha
Artist: పమ్మి డేనియల్ , ప్రభు పమ్మి, షారోన్ పాల్ పెర్లి
Category: Commitment
Song Lyrics
ఈ లోకము నన్ను విడిచినను నన్ను విడువని నా దేవుడవు ఎవరు లేని ఈ జీవితములో నా తోడు నీవై నన్నాదుకొంటివి నా హృదయమంత నీ కొరకే - సమర్పింతును దేవా నా జీవితమంతా నీ సాక్షిగా - నిలిచెదను యేసూ నీ మార్గములో నే నడిచెదను నీ చిత్తములో నే సాగెదను సొలిపోయిన నా ప్రాణము చేయి పట్టి నన్ను లేపితివి నన్నాదరించి చేరదీసి కన్నీరు తుడిచి హత్తుకొంటివి నా హృదయమంత నీ కొరకే - సమర్పింతును దేవా నా జీవితమంతా నీ సాక్షిగా - నిలిచెదను యేసూ నీ మార్గములో నే నడిచెదను నీ చిత్తములో నే సాగెదను యేసయ్యా.. నా చింతలన్ని తీరెనయ్యా నిన్ను చేరిన క్షణమే నిత్య జీవితం దొరికెనయ్యా నిన్ను చూసిన క్షణమే (3) నా వ్యాధులన్ని తొలిగెనయ్యా నిన్ను తాకిన క్షణమే నా భయాలన్ని పోయెనయ్యా నిన్ను నమ్మిన క్షణమే నా అడుగులన్ని స్థిరపరచువాడా నా త్రోవలను సిద్ధపరచువాడా నీ చిత్తములో నన్ను నడుపుమయ్యా నీ వాక్యముతో నన్ను నింపుమయ్యా Ee Lokamu Nannu Vidichinanu Nannu Viduvani Naa Devudavu Evaru Leni Ee Jeevithamulo Naa Thodu Neevai Nannaadukontivi Naa Hrudayamantha Nee Korake - Samarpinthunu Devaa Naa Jeevithamanthaa Nee Saakshigaa - Nilichedanu Yesoo Nee Maargamulo Ne Nadichedanu Nee Chitthamulo Ne Saagedanu Solipoyina Naa Praanamu Cheyi Patti Nannu Lepithivi Nannaadarinchi Cheradeesi Kanneeru Thudichi Hatthukontivi Naa Hrudayamantha Nee Korake - Samarpinthunu Devaa Naa Jeevithamanthaa Nee Saakshigaa - Nilichedanu Yesoo Nee Maargamulo Ne Nadichedanu Nee Chitthamulo Ne Saagedanu Yesayyaa.. Naa Chinthalanni Theerenayyaa Ninnu Cherina Kshaname Nithya Jeevitham Dorikenayyaa Ninnu Choosina Kshaname (3) Naa Vyaadhulanni Tholigenayyaa Ninnu Thaakina Kshaname Naa Bhayaalanni Poyenayyaa Ninnu Nammina Kshaname Naa Adugulanni Sthiraparachuvaadaa Naa Throvalanu Siddhaparachuvaadaa Nee Chitthamulo Nannu Nadupumayyaa Nee Vaakyamutho Nannu Nimpumayyaa