నా రక్షకా యేసునాధ - YouWorship
Naa Rakshakaa Yesunaadha
Artist: తిరుకోవళ్లూరి స్టీవెన్
Category: Praise
Song Lyrics
నా రక్షకా యేసునాధ ఇమ్మానుయేలు - ఘోర పాపుల పాప భార విమోచక ||నా రక్షకా|| 1. నిత్యకాలమునందు - నిజమైన దేవుని - సత్యవాక్యమై యున్న స్వామి నిన్నుతియింతు ||నా రక్షకా|| 2. సర్వ లోకంబులను - సత్యవాక్యమై యుండి - నిర్వహించిన దేవుని నిజబాహువా స్తుతింతు ||నా రక్షకా|| 3. దేవజనులకు - సువార్త దెలుప నభిషేకంబు పూని నొందిన దేవపుత్రుడ నుతియింతు ||నా రక్షకా|| 4. దేవ మహిమ ప్రకాశ - దీనరక్షక మానుష్యావతారము దాల్చి యావదాజ్ఞల దీర్చిన ||నా రక్షకా|| 5. పావనాద్భుతుడవై - పరమ జ్ఞానము గలిగి దేవస్వభావ ముద్ర - దేదీప్యుడా స్తుతింతు ||నా రక్షకా|| 6. పాపాత్ములను గావ - శాపభారము క్రింద - నోపికతో నిల్చి ప్రాపు జూపిన ప్రభువా ||నా రక్షకా|| 7. ఈ వసుధను ప్రేమ - నెసగునట్లుగ జూపి చావు గెల్చిన సర్వసామర్థ్యుడా స్తుతింతు ||నా రక్షకా|| 8. ఘన దేవుని కుడి పార్శ్వమున - గూర్చుండి విజ్ఞప్తి నొనరించు నా యేసు - వినయ స్తోత్రంబిదిగో ||నా రక్షకా|| Naa Rakshakaa Yesunaadha Immaanuyelu - Ghora Paapula Paapa Bhaara Vimochaka ||Naa Rakshakaa|| 1. Nithyakaalamunandu - Nijamaina Devuni - Sathyavaakyamai Yunna Svaami Ninnuthiyinthu ||Naa Rakshakaa|| 2. Sarva Lokambulanu - Sathyavaakyamai Yundi - Nirvahinchina Devuni Nijabaahuvaa Sthuthinthu ||Naa Rakshakaa|| 3. Devajanulaku - Suvaartha Delupa Nabhishekambu Pooni Nondina Devaputhruda Nuthiyinthu ||Naa Rakshakaa|| 4. Deva Mahima Prakaasha - Deenarakshaka Maanushyaavathaaramu Daalchi Yaavadaajnyala Deerchina ||Naa Rakshakaa|| 5. Paavanaadbhuthudavai - Parama Gnaanamu Galigi Devasvabhaava Mudra - Dedeepyudaa Sthuthinthu ||Naa Rakshakaa|| 6. Paapaathmulanu Gaava - Shaapabhaaramu Krinda - Nopikatho Nilchi Praapu Joopina Prabhuvaa ||Naa Rakshakaa|| 7. Ee Vasudhanu Prema - Nesagunatluga Joopi Chaavu Gelchina Sarvasaamarthyudaa Sthuthinthu ||Naa Rakshakaa|| 8. Ghana Devuni Kudi Paarshvamuna - Goorchundi Vijnyapthi Nonarinchu Naa Yesu - Vinaya Sthothrambidigo ||Naa Rakshakaa||