నా ప్రియ యేసు నీవే నా శ్రేయంపు రాజవు - YouWorship
Naa Priya Yesu Neeve Naa Shreyampu Raajavu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
1. నా ప్రియ యేసు నీవే నా శ్రేయంపు రాజవు (2) దయచే ప్రాయశ్చిత్తమైతివి నాదు రోజవు (2) 2. సాతానుకు నే దాసుదనై నాశమొందగా నాతాను ద్వారా తెలిపితివి నాదు ప్రియుడా 3. వ్యాధిగ్రస్తుండనై హృదయక్షీణ మొందితిన్ బాధల నొంది తప్పియుంటి నాదు ప్రియుడా 4. తప్పిన రూక, పిల్లవాడు, గొఱ్ఱెవలెనే తప్పిన నన్ను వెదకి రక్షించితివి ప్రియుడా 5. తలిదండ్రులు విడిచినను నీవు విడువవు చల్లగ ప్రక్కజేర్చి బ్రోతువీవు ప్రియుడా 6. నావాడవైతివి నేను నీదు వాడను నాయాపదయందున్న ప్రభువు నాదు ప్రియుడా 7. ప్రభావముతో సాక్ష్యమీయ రాజ్యమేలుచు ఆ భాగ్యమును చూడనిమ్ము నాదు ప్రియుడా 8. రక్షించితివి హల్లెలూయ పాడునట్లుగా ఈ క్షితిలో నెల్లరకు చాట నాదు ప్రియుడా 1. Naa Priya Yesu Neeve Naa Shreyampu Raajavu (2) Dayache Praayashchiththamaithivi Naadu Rojavu (2) 2. Saathaanuku Ne Daasudanai Naashamondagaa Naathaanu Dvaaraa Thelipithivi Naadu Priyudaa 3. Vyaadhigrasthundanai Hrudayaksheena Mondithin Baadhala Nondi Thappiyunti Naadu Priyudaa 4. Thappina Rooka, Pillavaadu, Gorrevalene Thappina Nannu Vedaki Rakshinchithivi Priyudaa 5. Thalidandrulu Vidichinanu Neevu Viduvavu Challaga Prakkajerchi Brothuveevu Priyudaa 6. Naavaadavaithivi Nenu Needu Vaadanu Naayaapadayandunna Prabhuvu Naadu Priyudaa 7. Prabhaavamutho Saakshyameeya Raajyameluchu Aa Bhaagyamunu Choodanimmu Naadu Priyudaa 8. Rakshinchithivi Hallelooya Paadunatlugaa Ee Kshithilo Nellaraku Chaata Naadu Priyudaa