నా ప్రాణప్రియుడా - YouWorship
Naa Praana Priyudaa Yesu Raajaa
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
నా ప్రాణప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణ|| విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడెదను నా ప్రభువా ||నా ప్రాణ|| గర్భమున పుట్టిన బిడ్డలన్ కరుణింపక తల్లి మరచునా మరచినగాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా ||నా ప్రాణ|| రక్షణాలంకారములను అక్షయమగు నీ యాహారమున్ రక్షకుడా నాకొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును ||నా ప్రాణ|| నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతా స్తుతులతోడ నీ ప్రేమను నే వివరింతును విమోచకా ||నా ప్రాణ|| వాగ్ధానముల్ నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే పాడెదను ప్రహర్షింతును హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||నా ప్రాణ|| Naa Praanapriyudaa Yesu Raajaa Arpinthunu Naa Hrudayaarpana Virigi Naligina Aathmathonu Hrudayapoorvaka Aaraadhantho Sathyamugaa Adbhuthakarudaa Aalochana Aascharya Samadhaana Prabhuvaa Balavanthudaa Bahupriyudaa Manoharudaa Mahimaraajaa Sthuthinchedan ||Naa Praana|| Vimochana Gaanamulatho Soundarya Prema Sthuthulatho Namaskarinchi Aaraadhinthun Harshinthunu Ne Paadedanu Naa Prabhuvaa ||Naa Praana|| Garbhamuna Puttina Biddalan Karunimpaka Thalli Marachunaa Marachinagaani Neevennadu Maruvavu Viduvavu Edabaayavu Karuna Raajaa ||Naa Praana|| Rakshanaalankaaramulanu Akshayamagu Nee Yaahaaramun Rakshakudaa Naakosagithivi Deekshatho Ninnu Veekshinchuchu Sthuthinthunu ||Naa Praana|| Nee Neethini Nee Rakshananu Naa Pedavulu Prakatinchunu Kruthagnathaa Sthuthulathoda Nee Premanu Ne Vivarinthunu Vimochakaa ||Naa Praana|| Vaagdhaanamul Naalo Neraverenu Vimochinchi Naakichchithive Paadedanu Praharshinthunu Hallelooyaa Hallelooyaa Hallelooyaa ||Naa Praana||