నా జీవిత యాత్రలో - YouWorship
Naa Jeevitha Yaathralo
Artist: Unknown Artist
Category: Comfort
Song Lyrics
నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు (2) ||నా జీవిత|| పలు విధ శోధన కష్టములు ఆవరించియుండగా (2) కలత చెందుచున్న హృదయమును కదలక కాపాడుము (2) ||నా జీవిత|| నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు (2) నీదు కుడి హస్తములో నిత్యమున నాకు సుఖ క్షేమముగా (2) ||నా జీవిత|| ఈ లోక నటన ఆశలన్నియు తరిగిపోవుచుండగా (2) మారని వాగ్ధానములన్నియు నే నమ్మి సాగెదను(2) ||నా జీవిత|| ముందున్న సంతోషము తలంచి నిందలను సహించి (2) నీ సిలువను నే మోయుటకై నీ కృప నాకీయుము (2) ||నా జీవిత|| సీయోను యొక్క ఆలోచనతో సదా నడిపించుము (2) మహిమలో నీతోనే నిల్చుటకు నా తండ్రి దయచూపుము (2) ||నా జీవిత|| Naa Jeevitha Yaathralo Prabhuvaa Nee Paadame Sharanam Ee Lokamu Nandu Neevu Thappa Vere Aashrayam Ledu (2) ||Naa Jeevitha|| Palu Vidha Shodhana Kashtamulu Aavarinchiyundagaa (2) Kalatha Chenduchunna Hrudayamunu Kadalaka Kaapaadumu (2) ||Naa Jeevitha|| Nee Sannidhilo Sampoornamaina Santhoshamu Kaladu (2) Needu Kudi Hasthamulo Nithyamuna Naaku Sukha Kshemamegaa (2) ||Naa Jeevitha|| Ee Loka Natana Aashalanniyu Tharigipovuchundagaa (2) Maarani Vaagdhaanamulanniyu Ne Nammi Saagedunu (2) ||Naa Jeevitha|| Mundunna Santhoshamu Thalanchi Nindalanu Sahinchi (2) Nee Siluvanu Ne Moyutakai Nee Krupa Naakeeyumu (2) ||Naa Jeevitha|| Seeyonu Yokka Aalochanatho Sadaa Nadipinchumu (2) Mahimalo Neethone Nilchutaku Naa Thandri Dayachoopumu (2) ||Naa Jeevitha||