నాయాత్మ లంగరువేయ సుస్థిర భూమి చిక్కెను - YouWorship
Naayaathma Langgaruveya Susthira Bhoomi Chikkenu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
1. నాయాత్మ లంగరువేయ - సుస్థిర భూమి చిక్కెను నా పాపము హరించెడు - నిత్యుండౌ యేసుగాయముల్ కల్పాంతకాలమైనను - సదా యీ ప్రేమనిల్చును 2. తండ్రీ! నీ ప్రేమ నిత్యమై - మాయల్ప బుద్ధిని మించు నీ యుల్లమందు సర్వదా - కారుణ్యముండినందున మరలివచ్చు పాపులన్ - జేర్చి జీవింప జేతువు 3. నీ ప్రేమ లోతుతేలదు - మేమెన్న శక్యముగాదు నా పాపమంత దాచితి - నిర్దోషిగా నన్నెంచితి శ్రీయేసు పుణ్యముండగా - ధారాళ కృపనిత్తువు 4. నా కష్టముల్ తుఫానుగా - నా తలపైన క్రమ్మిన లోకేచ్ఛలన్ని భంగమై - యసౌఖ్యముల్ ప్రాప్తించిన నీ ప్రేమ నిత్యము కాగా - నదే నాయాత్మలంగరు 5. హృదయ భీతియుండిన - ప్రపంచము లయించిన నీ వన్ని కదిలింపుము - నాలంగర్ స్థిరమై యుండి ననంత ప్రేమ శక్తిని అనుభవింతు 1. Naayaathma Langgaruveya - Susthira Bhoomi Chikkenu Naa Paapamu Harinchedu - Nithyundau Yesugaayamul Kalpaanthakaalamainanu - Sadaa Yee Premanilchunu 2. Thandree! Nee Prema Nithyamai - Maayalpa Buddhini Minchu Nee Yullamandu Sarvadaa - Kaarunyamundinanduna Maralivachchu Paapulan - Jerchi Jeevimpa Jethuvu 3. Nee Prema Lothutheladu - Memenna Shakyamugaadu Naa Paapamantha Daachithi - Nirdoshigaa Nannenchithi ShreeYesu Punyamundagaa - Dhaaraala Krupaniththuvu 4. Naa Kashtamul Thuphaanugaa - Naa Thalapaina Krammina Lokechchhalanni Bhanggamai - Yasaukhyamul Praapthinchina Nee Prema Nithyamu Kaagaa - Nade Naayaathmalanggaru 5. Hrudaya Bheethiyundina - Prapanchamu Layinchina Nee Vanni Kadilimpumu - Naalanggar Sthiramai Yundi Nanantha Prema Shakthini Anubhavinthu