నాదు హృదయపు ద్వారము తెరచెదను - YouWorship
Naadu Hrudayapu Dvaaramu Therachedanu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: నాదు హృదయపు ద్వారము తెరచెదను (2)- యేసు పాపపు రోగికి నీ వేగతి (2) 1. యేసు చచ్చిన వారిని లేపితివే (2) - మరి కుంటికి కాళ్ళను యిచ్చితివే (2) నేను పాపిని రోగిని నీవేగతి (2) - నాకు దిక్కిక లేదిక వేరెక్కడ (2) 2. ప్రభు కుష్ఠును ప్రేమతో ముట్టితివి - మరి దుష్టుల చెంతను చేరితివి నాదు పాపపు కుష్ఠును పారద్రోలి - పరిశుద్ధత నియ్యుము నీవేగతి 3. యాయీరు కుమార్తెను లేపితివి - మరి మృతుడగు లాజరు బ్రతికెనుగా నేను చచ్చిన పాపిని శరణు ప్రభూ - నాకు వేరొక మార్గము లేదికను 4. ప్రభు మార్గము ప్రక్కన కూర్చొనిన - ఆ అంధుని ధ్వనిని వింటివిగా నేను పాపిని అంధుని యేస ప్రభూ - నను దాటకు దిక్కిక లేదు ప్రభూ Pallavi: Naadu Hrudayapu Dvaaramu Therachedanu (2)- Yesu Paapapu Rogiki Nee Vegathi (2) 1. Yesu Chachchina Vaarini Lepithive (2) - Mari Kuntiki Kaallanu Yichchithive (2) Nenu Paapini Rogini Neevegathi (2) - Naaku Dikkika Ledika Verekkada (2) 2. Prabhu Kushthunu Prematho Muttithivi - Mari Dushtula Chenthanu Cherithivi Naadu Paapapu Kushthunu Paaradroli - Parishuddhatha Niyyumu Neevegathi 3. Yaayeeru Kumaarthenu Lepithivi - Mari Mruthudagu Laajaru Brathikenugaa Nenu Chachchina Paapini Sharanu Prabhoo - Naaku Veroka Maargamu Ledikanu 4. Prabhu Maargamu Prakkana Koorchonina - Aa Andhuni Dhvanini Vintivigaa Nenu Paapini Andhuni Yesa Prabhoo - Nanu Daataku Dikkika Ledu Prabhoo