నాదు దేవా నాదు దేవా నన్నేల విడనాడితివయ్యా - YouWorship
Naadu Devaa Naadu Devaa Nannela Vidanaadithivayyaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నాదు దేవా నాదు దేవా - నన్నేల విడనాడితివయ్యా అను పల్లవి: నన్ను రక్షింపక ఆర్తధ్వని (2) - వినక నీవేల దూరమున్నావు? (2) || నాదు || 1. రాత్రింబగళ్ళు మొఱ్ఱబెట్టగా - ఏల నుత్తరమీయకున్నావు (2) ఇశ్రే లు స్తోత్రముపై కూర్చున్న (2)- పరిశుద్ధ దేవుడవై యున్నావు (2) 2. మా పితరులు నీయందు - విశ్వసించగా రక్షించితివి మొఱలిడి నిన్ను నమ్మిరి - విడుదలొంది సిగ్గునొందలేదు 3. నరుడను కాను పురుగును - నరులచే నిందింపబడితి నరులచే తృణీకారము - పొందియున్న వాడనైతిని 4. నన్ను జూచు వారెల్లరు - తమ పెదవులను విరిచి తలల నాడించుచున్నారు - నన్నపహసించుచున్నారు 5. యెహోవాపై భారముంచుము - తాను నిన్ను విడిపించునేమో వాడాయన కిష్టుడు కాడా - వాని తప్పించునేమో యందురు 6. గర్భమునుండి నన్ దీసిన వాడా - నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కాదా - నాకు నమ్మిక పుట్టించితివి 7. గర్భవాసినైనది మొదలు - నుండి నా కాధారము నీవే నన్ను దల్లి కనిన నాటి - నుండి నా దేవుడవు నీవే Pallavi: Naadu Devaa Naadu Devaa - Nannela Vidanaadithivayyaa Anu Pallavi: Nannu Rakshimpaka Aarthadhvani (2) - Vinaka Neevela Dooramunnaavu? (2) || Naadu || 1. Raathrimbagallu Morrabettagaa - Ela Nuththarameeyakunnaavu (2) Ishre Lu Sthothramupai Koorchunna (2)- Parishuddha Devudavai Yunnaavu (2) 2. Maa Pitharulu Neeyandu - Vishvasinchagaa Rakshinchithivi Moralidi Ninnu Nammiri - Vidudalondi Siggunondaledu 3. Narudanu Kaanu Purugunu - Narulache Nindimpabadithi Narulache Thruneekaaramu - Pondiyunna Vaadanaithini 4. Nannu Joochu Vaarellaru - Thama Pedavulanu Virichi Thalala Naadinchuchunnaaru - Nannapahasinchuchunnaaru 5. Yehovaapai Bhaaramunchumu - Thaanu Ninnu Vidipinchunemo Vaadaayana Kishtudu Kaadaa - Vaani Thappinchunemo Yanduru 6. Garbhamunundi Nan Deesina Vaadaa - Naa Thalli Yodda Sthanyapaanamu Cheyuchundagaa Neeve Kaadaa - Naaku Nammika Puttinchithivi 7. Garbhavaasinainadi Modalu - Nundi Naa Kaadhaaramu Neeve Nannu Dalli Kanina Naati - Nundi Naa Devudavu Neeve