నాకేమి కొదువ - YouWorship
Naakemi Koduva
Artist: ముంగమూరి దేవదాసు
Category: Praise & Worship
Song Lyrics
నాకేమి కొదువ - నాధుడుండ నింక = శ్రీకరుండగు దేవుడే నా - శ్రేష్ఠ పాలకుడు - నా - యేక రక్షకుండు గనుక ||నాకేమి|| 1. తనివి దీర మేళ్లనుభవింప - నేను = నను సదా మేళ్లనెడి పచ్చిక - నదిమి మృదువుగ - బండు - కొనజేయును గనుక ||నాకేమి|| 2. ఎంత శోధన - యెండ యున్న - నాకు = నెంతకు నోరిగర దెపుడు - శాంత జలములు - నా చెంతనే యుండువ గనుక ||నాకేమి|| 3. తప్పిపోయిన నన్ - దారిం బెట్టి - నన్ను = తెప్పరిల్ల జేసి నాకు నీరు నలసటను - నా - తప్పు మన్నించున్ కనుక ||నాకేమి|| 4. నీతి మార్గమునన్ - నిల్పున్ నన్ను - ప్రభువు = నీతి లేని నాకు దనను - నీతి దయ చేయున్ - స్వ - నీతిని ద్రుంచున్ గనుక ||నాకేమి|| 5. చావు చీకట్లు - శక్తియుండు - ఆహా = లోయలోబడి పోవలసినను - నే వెరవకుందును - నా - దేవుండే తోడు గనుక ||నాకేమి|| 6. మీదబడునట్టి - శోధనలన్ - ధరను = నా దరికి రానీక దండము - నన్ను బ్రోచుచును - నా - కాదరణ యౌను గనుక ||నాకేమి|| 7. పగవారల్ సిగ్గు - పడునట్లుగ - నా = జగము యెరుగని సౌఖ్య భోజన మగపరచును - హో - తగినదే పెట్టున్ గనుక ||నాకేమి|| 8. తన యాత్మానంద - తైలంబుతో - ప్రభువు = ననుదినము తలయంటి విసుగ - కొనక తుడుచును - నా కన్నీళ్ళన్ని గనుక ||నాకేమి|| 9. పలువిధములైన భాగ్యములతో - తండ్రి = వెలుపలికి దిగవెడలునట్టి - వెల గల గిన్నె - నా కలిమిగా జేయున్ గనుక ||నాకేమి|| 10. బ్రదుకంతటన్ గృ - పా క్షేమములు - నా = వదలకుండగ వచ్చు నాతో - సుదినములు గల్గ - నా - పదలు సంపదలౌ గనుక ||నాకేమి|| 11. దురితంబు లుండు - ధరణి నాకు నిజము = నిరవు కాదిక నెప్పటికి నా - పరమ దేవుని - మం - దిరమే నా యిల్లు గనుక ||నాకేమి|| Naakemi Koduva - Naadhudunda Ninka = Shreekarundagu Devude Naa - Shreshtha Paalakudu - Naa - Yeka Rakshakundu Ganuka ||Naakemi|| 1. Thanivi Deera Mellanubhavimpa - Nenu = Nanu Sadaa Mellanedi Pachchika - Nadimi Mruduvuga - Bandu - Konajeyunu Ganuka ||Naakemi|| 2. Entha Shodhana - Yenda Yunna - Naaku = Nenthaku Norigara Depudu - Shaantha Jalamulu - Naa Chenthane Yunduva Ganuka ||Naakemi|| 3. Thappipoyina Nan - Daarin Betti - Nannu = Thepparilla Jesi Naaku Neeru Nalasatanu - Naa - Thappu Manninchun Kanuka ||Naakemi|| 4. Neethi Maargamunan - Nilpun Nannu - Prabhuvu = Neethi Leni Naaku Dananu - Neethi Daya Cheyun - Sva - Neethini Drunchun Ganuka ||Naakemi|| 5. Chaavu Cheekatlu - Shakthiyundu - Aahaa = Loyalobadi Povalasinanu - Ne Veravakundunu - Naa - Devunde Thodu Ganuka ||Naakemi|| 6. Meedabadunatti - Shodhanalan - Dharanu = Naa Dariki Raaneeka Dandamu - Nannu Brochuchunu - Naa - Kaadarana Yaunu Ganuka ||Naakemi|| 7. Pagavaaral Siggu - Padunatluga - Naa = Jagamu Yerugani Saukhya Bhojana Magaparachunu - Ho - Thaginade Pettun Ganuka ||Naakemi|| 8. Thana Yaathmaananda - Thailambutho - Prabhuvu = Nanudinamu Thalayanti Visuga - Konaka Thuduchunu - Naa Kanneellanni Ganuka ||Naakemi|| 9. Paluvidhamulaina Bhaagyamulatho - Thandri = Velupaliki Digavedalunatti - Vela Gala Ginne - Naa Kalimigaa Jeyun Ganuka ||Naakemi|| 10. Bradukanthatan Gru - Paa Kshemamulu - Naa = Vadalakundaga Vachchu Naatho - Sudinamulu Galga - Naa - Padalu Sampadalau Ganuka ||Naakemi|| 11. Durithambu Lundu - Dharani Naaku Nijamu = Niravu Kaadika Neppatiki Naa - Parama Devuni - Man - Dirame Naa Yillu Ganuka ||Naakemi||